అమెరికాలో మిస్సింగ్ కేసు.. శ్రీజారెడ్డి ఆచూకీ కోసం రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్లు!
Sreeja Reddy Missing Case: అమెరికాలోని బోస్టన్‌లో అదృశ్యమైన తెలంగాణకు చెందిన నల్గొండ యువతి కోయ శ్రీజారెడ్డి ఆచూకీ ఇంకా లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆమె కనిపించకుండా పోయి ఇప్పటికే 14 రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదు. ఒకవైపు అమెరికా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరోవైపు శ్రీజారెడ్డి క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
బోస్టన్‌లో అదృశ్యమైన శ్రీజారెడ్డి ఆచూకీ కోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రయత్నాలు.. అమెరికాకు వెళ్లి విచారణ..
నల్గొండ యువతి శ్రీజారెడ్డి ఏమైంది? బోస్టన్‌లో కొనసాగుతున్న ముమ్మర గాలింపు..
అమెరికాలోని బోస్టన్‌లో అదృశ్యమైన తెలంగాణకు చెందిన నల్గొండ యువతి కోయ శ్రీజారెడ్డి ఆచూకీ ఇంకా లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆమె కనిపించకుండా పోయి ఇప్పటికే 14 రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదు. ఒకవైపు అమెరికా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరోవైపు శ్రీజారెడ్డి క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీజారెడ్డి అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం పలు స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా ఈ కేసులో చొరవ తీసుకున్నారు. స్వయంగా అమెరికాకు వెళ్లి శ్రీజారెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికాకు వెళ్లిన అద్దంకి దయాకర్.. శ్రీజారెడ్డి నివసించిన ఇంటిని సందర్శించారు. ఆమెతో సన్నిహితంగా ఉండే స్నేహితులను కలిసి మాట్లాడారు. శ్రీజ వ్యక్తిత్వం, ఆమె అలవాట్లు, విద్యాభ్యాసం, అకడమిక్ నేపథ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల ఆమెకు ఉద్యోగం కూడా వచ్చినట్లు స్నేహితులు తెలిపారని అద్దంకి వెల్లడించారు. శ్రీజారెడ్డి వ్యక్తిగత జీవితం, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తు విషయంలో అమెరికా అధికారులతో కూడా అద్దంకి దయాకర్ మాట్లాడారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారని తెలిపారు. శ్రీజారెడ్డి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, తమ కుమార్తెకు ఏమైందనే ఆందోళన కంటే అసలు ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడమే వారిని మరింత కలచివేస్తోందని వివరించారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరుగుతోందని అన్నారు.
మరోవైపు ఈ కేసులో అమెరికాకు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా రంగంలోకి దిగినట్లు అద్దంకి దయాకర్ వెల్లడించారు. అత్యంత గోప్యంగా వారు తమ విచారణ కొనసాగిస్తున్నారని, శ్రీజారెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, మొత్తం వ్యవహారం మిస్టరీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో విస్తృతంగా సీసీటీవీ కెమెరాలు, పోలీసు వాహనాల నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉంటాయని అద్దంకి పేర్కొన్నారు. శ్రీజారెడ్డి ఫోన్ బీచ్ సమీపంలో లభించిందని, ఈ ఆధారంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే అమెరికా పోలీసులకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వ్యవస్థల సహాయంతో కేసును ఛేదించే సామర్థ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అదే సమయంలో మరో కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీచ్ సమీపంలోనే ఉద్దేశపూర్వకంగా తన సెల్‌ఫోన్‌ను వదిలిపెట్టి శ్రీజారెడ్డి మరెక్కడికైనా వెళ్లిపోయిందా? అనే అనుమానాన్ని కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఏ ఒక్క అవకాశాన్నీ కొట్టిపారేయలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శ్రీజారెడ్డి అదృశ్యమై రెండు వారాలు దాటుతున్న నేపథ్యంలో ఆమె ఆచూకీపై స్పష్టమైన సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అమెరికా పోలీసుల దర్యాప్తు, స్థానిక డిటెక్టివ్‌ల ప్రయత్నాలు, తెలంగాణ ప్రజాప్రతినిధుల చొరవతో ఈ కేసులో త్వరలోనే పురోగతి లభిస్తుందని ఆశిస్తున్నారు. శ్రీజారెడ్డి క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.
Tags
Be the first to react