తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతివాడూ హీరోనే అంటున్నాడు మోగ్లీ. అతను ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆమె కోసం ఎవరితో యుద్ధం చేయాల్సి వచ్చిందో తెలియాలంటే 'మోగ్లీ 2025' చూడాల్సిందే. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా సందీప్జ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.
ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాగాయకుడు ఘంటసాల గురించి ఈతరానికి తెలియాలనే తపనతో ఎంతో కష్టపడి తీసిన సినిమా ‘ఘంటసాల ది గ్రేట్” అంటున్నారు దర్శకుడు సి. హెచ్.రామారావు.
ఆయన దర్శకత్వంలో కృష్ణచైతన్య టైటిల్ పాత్ర పోషించిన చిత్రమిది. మృదుల, సుమన్, సాయికిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ రాజ్, త్రిగుణ్ కీలక పాత్రల్లో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా'.
హెబ్బా పటేల్ కథానాయిక. దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ కూడా డిసెంబర్ 125 (Isha movie 2025 release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షాక్ కి గురి చేసే అంశాలు చాలా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిస్ టీరియస్' . మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. సమాజానికి ఉపయోగపడే అంశాలతో రూపొందించిన చిత్రమే 'నా తెలుగోడు' అంటున్నారు హరినాథ్ పొలిచర్ల.
ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందించిన చిత్రమిది. తనికెళ్ల భరణి, రఘుబాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి చరణ్ ఉషశ్రీ జంటగా మణికంఠ తెరకెక్కించిన చిత్రం 'ఇట్స్ ఓకే గురు'.
క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి ప్రేమకథతో పాటు అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రమిదని, ఒత్తిడిలో ఉన్న వాళ్లు ఈ సినిమా చూస్తే దాంట్లో నుంచి బయటకొచ్చేస్తారని చిత్ర బృందం చెబుతోంది.
నెటిక్స్
మ్యాన్ వర్సెస్ బేబీ (వెబ్ సిరీస్) డిసెంబరు 11
గుడ్బై జూన్ (మూవీ) డిసెంబరు 12
సింగిల్పాపా (హిందీ వెబ్సరీస్) డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ (మూవీ) డిసెంబరు 12
అమెజాన్ ప్రైమ్
మెర్వ్ (మూవీ) డిసెంబరు 10
టెల్ మి సాఫ్టీ (మూవీ) డిసెంబరు 12
జియో హాట్ స్టార్
సూపర్మ్యాన్ (మూవీ) డిసెంబరు 11
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ (మూవీ) డిసెంబరు 1.
ఆహా
త్రీ రోజెస్ (తెలుగు సిరీస్) డిసెంబరు 12
సాలీ మొహబ్బత్ (మూవీ) డిసెంబరు 12