Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రీబూట్…! సేవ, ఐక్యతే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్‌లో కీలక సమావేశం జరిగింది. సేవా కార్యక్రమాలు, అభిమానుల ఐక్యతే లక్ష్యంగా రాష్ట్ర, జిల్లా, టౌన్ స్థాయి కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

Published : 2026-02-09 11:17:00

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఒక్క తాటిపైకి తీసుకురావడంతో పాటు, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిన్న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కీలక కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై లోతైన చర్చ జరిగింది. అభిమానుల ఐక్యతే లక్ష్యంగా, ఫ్యాన్స్ అసోసియేషన్‌ను మరింత వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు నేతలు తెలిపారు.

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేశారు. స్టేట్ లెవల్ కమిటీతో పాటు జిల్లా, టౌన్ స్థాయి కమిటీలు ఏర్పడితే, ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీలు అభిమానుల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, ఏ కార్యక్రమం చేపట్టినా క్రమబద్ధంగా అమలు చేసేలా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా జనసేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ విలువలను ప్రతిబింబించేలా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని నేతలు సూచించారు. కేవలం సినిమా విజయాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా అభిమానుల శక్తిని మలచాలనే ఆలోచనను ఈ సమావేశంలో ముందుకు తీసుకువచ్చారు. ఐకాన్ స్టార్‌కు ఉన్న దేశవ్యాప్త క్రేజ్‌కు తగ్గట్టుగా ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక బలమైన, బాధ్యతాయుతమైన వేదికగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అభిమానుల మధ్య అనవసర విభేదాలకు చోటు లేకుండా, ఐక్యతతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు బలమైన ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్న విషయం తెలిసిందే. అవి ఎన్నేళ్లుగా క్రమపద్ధతిలో కొనసాగుతూ, సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ కూడా తన అభిమానుల కోసం ప్రత్యేకంగా బలమైన ఫ్యాన్స్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన సందర్భంగా, అల్లు అర్జున్ తరఫున ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో లోపం కనిపించిందన్న చర్చ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, ఫ్యాన్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అల్లు అర్జున్ గుర్తించారని అభిమానులు భావిస్తున్నారు.

Spotlight

Read More →