రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌లో మదనపల్లి కుర్రాడి ఘనత.. ఘనంగా అభినందించిన మదనపల్లి టీడీపీ నాయకులు!

అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీడ్స్ కోపూరి మల్లికార్జున నాయుడు కుమారుడు కోపూరి శశిధర్ నాయుడు అంతరాష్ట్ర వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి మదనపల్లి ప్రాంత కీర్తిని చాటారు.

రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌లో మదనపల్లి కుర్రాడి ఘనత..
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్‌లో మదనపల్లి కుర్రాడి ఘనత..
  • మదనపల్లి కీర్తిని చాటిన కోపూరి శశిధర్.. జాతీయ వేదికలపై రాణించాలని రాటకొండ మధుబాబు ఆకాంక్ష!

  • శశిధర్ నాయుడి అభినందన సభలో మాజీ సైనికుల సంఘం.. దేశ గర్వించదగ్గ షూటర్గా ఎదగాలని పిలుపు!

అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీడ్స్ కోపూరి మల్లికార్జున నాయుడు కుమారుడు కోపూరి శశిధర్ నాయుడు అంతరాష్ట్ర వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి మదనపల్లి ప్రాంత కీర్తిని చాటారు. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రేంజ్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 26వ రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో (26th AP State Shooting Championship) ఆయన పాల్గొని, తన గురిని ప్రదర్శించి అత్యుత్తమ ప్రతిభతో ఘన విజయం సాధించారు. ఈ అపురూప విజయంతో మదనపల్లి నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా క్రీడా వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కోపూరి శశిధర్ నాయుడు సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని మదనపల్లికి చెందిన ప్రముఖ సామాజిక శ్రేయోభిలాషి రాటకొండ మధుబాబు ఆయనను ప్రత్యేకంగా కలుసుకుని దుశ్శాలువాతో సత్కరించి, బొకే అందజేసి తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కనబరిచిన ఇదే పట్టుదలను మున్ముందు కూడా కొనసాగించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మదనపల్లి పేరును నిలపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘనమైన అభినందన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ మాజీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మదనపల్లి మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, ప్రముఖ వ్యాపారవేత్త లారీ సుధ, తెలుగు యువత ముఖ్య నాయకులు గండికోట గణేష్ బాబుతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, క్రీడాభిమానులు పాల్గొని శశిధర్ నాయుడిని అభినందనల్లో ముంచెత్తారు.

Tags

Be the first to react

Latest