ఆక్వా రంగానికి రూ.1,180 కోట్ల విద్యుత్ సబ్సిడీ.. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి!
ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులు, హేచరీల సమస్యలపై కేంద్రంతో కలిసి చర్యలు: అచ్చెన్నాయుడు..
ఏపీ ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం.. త్వరలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు..
అమరావతి: ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆక్వా రంగానికి సంబంధించి రైతులు ప్రధానంగా విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఆక్వా రంగానికి పవర్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.1,180 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఆక్వా రైతులు, హేచరీల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశవ్యాప్తంగా ఏపీ మత్స్య ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన సహకారం అందించి ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాష్ట్రానికి త్వరలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు రానుందని మంత్రి తెలిపారు. దీనివల్ల ఆక్వా రంగ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆక్వా రైతులు, హేచరీల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి తగిన పరిష్కారాలు తీసుకొస్తామని చెప్పారు. త్వరలో ఆల్ ఇండియా హేచరీస్ అసోసియేషన్, ఏపీ హేచరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆక్వా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.