Intintiki Telugu Desam: ‘ఇంటింటికీ తెలుగుదేశం’పై నారా లోకేష్ దిశానిర్దేశం.. మంత్రులకు కీలక ఆదేశాలు!

Intintiki Telugu Desam: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం విజయవంతంగా 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తున్నారు.

Intintiki Telugu Desam
Intintiki Telugu Desam

టీడీపీ ‘2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం జోరు.. ఒక్కరోజే 3.53 లక్షల ఇళ్ల సందర్శన..

ఇంటింటికీ వెళ్లి ‘సూపర్ సిక్స్’ హామీలపై వివరణ.. టీడీపీ భారీ కార్యక్రమం..

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం విజయవంతంగా 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తున్నారు.

పార్టీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత 14 రోజుల్లో టీడీపీ శ్రేణులు 40.74 లక్షలకు పైగా కుటుంబాలను ప్రత్యక్షంగా కలిశాయి. ఆదివారం ఒక్కరోజే 3,53,294 ఇళ్లను సందర్శించినట్లు పార్టీ తెలిపింది.

‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరాలు అందిస్తున్నారు.

ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ సమన్వయంతో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పర్యటనలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయని పార్టీ తెలిపింది. ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని టీడీపీ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి నాయకత్వం మరింత చురుగ్గా పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా క్లస్టర్, మండల స్థాయి నాయకులను ఫోకస్ బూత్‌లకు అనుసంధానం చేశారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాన్ని పక్కాగా సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం సూచించింది.

తమకు కేటాయించిన జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని నారా లోకేష్ ఆదేశించారు. కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, వారి సమస్యలు, అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.

Tags

Be the first to react

Latest