Talliki Vandanam: తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్‌డేట్! డబ్బులు పడకపోతే వెంటనే ఈ పని చేయండి!

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని అర్హులైన తల్లులు తమ ఇ-కేవైసీ మరియు ఆధార్ లింకింగ్ పూర్తి చేసుకుంటే ఖాతాల్లో రూ. 15,000 జమ కానున్నాయి.

తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్‌డేట్
తల్లికి వందనం రెండో విడతపై బిగ్ అప్‌డేట్

Talliki Vandanam: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ హామీలలో భాగంగా పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్లినా ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి విడతలో మెజారిటీ అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కాగా, మిగిలిపోయిన లబ్ధిదారుల డేటాను రీ-వెరిఫికేషన్ చేస్తున్నారు.

రెండో విడత నిధుల పొందేందుకు లబ్ధిదారులు తమ దరఖాస్తు స్టేటస్‌ను సచివాలయాల వద్ద లేదా జ్ఞానభూమి/ఎన్‌పిసిఐ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding) కాకపోవడం, ఇ-కేవైసీ పెండింగ్‌లో ఉండటం లేదా విద్యార్థి హాజరు శాతం నిబంధనల ప్రకారం లేకపోవడం వల్ల మొదటి విడత నిధులు నిలిచిపోయిన వారు వెంటనే సచివాలయ సంక్షేమ కార్యదర్శులను సంప్రదించి వివరాలను సవరించుకోవాలి.

ఈ రెండో విడత ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల రీ-పరిశీలనను వేగవంతం చేశారు. పెండింగ్ సవరణలు పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఫైనల్ జాబితాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీల్లో అర్హులైన ప్రతీ తల్లి ఖాతాలోకి డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా రూ. 15,000 జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఏదైనా కారణంతో దరఖాస్తు రిజెక్ట్ అయినట్లయితే, దానికి గల స్పష్టమైన కారణాన్ని పోర్టల్‌లో తెలుసుకుని సంబంధిత పత్రాలను సమర్పించి రీ-అప్లై లేదా గ్రీవెన్స్ దాఖలు చేసుకునే అవకాశాన్ని కూడా పాఠశాల విద్యాశాఖ కల్పించింది. 

Tags

Be the first to react

Latest