⚡ BREAKING

Chandrababu: గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు!

Chandrababu: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాలింపు చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు.

Missing Fishermen in AP
Missing Fishermen in AP

గంగవరం బోటు ప్రమాదం: నేవీ, కోస్టుగార్డుతో విస్తృత గాలింపు చర్యలు..

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం హెలికాప్టర్లు, నౌకలతో రెస్క్యూ ఆపరేషన్..

అమరావతి: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాలింపు చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు.

బోటు ప్రమాదానికి సంబంధించి మత్స్యకారుడు చిన్నా అందించిన కీలక సమాచారం ఆధారంగా గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశారు. గంగవరం పరిసర ప్రాంతాల్లో బోటు బోల్తా పడిన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గల్లంతైన మత్స్యకారులను త్వరితగతిన గుర్తించేందుకు నేవీ, కోస్టు గార్డు, మెరైన్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, కోస్టు గార్డు నౌకలు, ఇతర సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి.

తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో ప్రత్యేకంగా గాలింపు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించేందుకు అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు.

రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమన్వయం చేసేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలతో సమన్వయం చేసుకుంటూ గాలింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

Tags

Be the first to react

Latest