వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో భూకబ్జాకు కుట్రలు.. గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ అక్రమాలు బట్టబయలు..
విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, కోనాడ గ్రామానికి చెందిన దంగా భూలోక గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “కోనాడ గ్రామ సర్పంచ్ గా మూడు పర్యాయములు, MPTCగా ఓ సారి ఎన్నికల్లో గెలిచాను. ప్రస్తుతం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బి.సి. సెల్ కార్యదర్శిగా ఉంటున్నాను.
- రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వజ్జ బాబురావు..
- అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, కోనాడ గ్రామానికి చెందిన దంగా భూలోక గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “కోనాడ గ్రామ సర్పంచ్ గా మూడు పర్యాయములు, MPTCగా ఓ సారి ఎన్నికల్లో గెలిచాను. ప్రస్తుతం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బి.సి. సెల్ కార్యదర్శిగా ఉంటున్నాను. మా గ్రామంలో 1997లో 1. దంగా సత్యవతి భర్త భూలోక సర్వే నెం. 44/5 ఎ.0-03 సెంట్లు, పట్టా నెం. 160/1406, 2. దంగా దుర్గమ్మ భర్త దానయ్య, M/o భూలోక సర్వే నెంబరు 44/6 ఎ.0-02 సెంట్లు, పట్టా నెం. 159/1406, 3. తాటికొండ నాగమణి భర్త వెంకటరావు సర్వే నెంబరు 44/7 ఎ.0-02 సెంట్లు, పట్టా నెం. 161/1406, మొత్తం 0-07 సెంట్లు స్థలాన్ని ముగ్గురుకి Rc.No. 349/ 1997 ద్వారా పట్టాలు మంజూరు చేశారు. అందులో కొంత భూమిలో ఇల్లు కట్టుకొని మిగతా భూమిలో కొబ్బరి మొక్కలు వేసుకొని అనుభవిస్తున్నాము.
2020లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దురుద్ధేశ్య పూర్వకంగా కావాలనే కొందరు నాపై స్థానిక ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశాలు మేరకు స్థానిక తహశీల్దారు ఫారం -7 నోటీసు ఇచ్చారు. దీనిపై మేము హైకోర్టుకు సైతం వెళ్లాం. దీనిపై కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆదేశాలు ప్రకారం మరల ఫారం -6 ఇచ్చి భూమి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఆయన అనుచరులు నేటికి మమ్మల్ని వేధిస్తున్నారు.” దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
వైఎస్ఆర్ కడప జిల్లా, సి.కె.దిన్నె మండలం, ఉత్తుకూరు గ్రామానికి చెందిన బైరెడ్డి చిన్న అంకాల రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “మా గ్రామంలోని సర్వే నంబర్ 669లో మొత్తం 0.92 సెంట్ల భూమి ఉంది. అందులో నేను 0.25 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. ఈ భూమి గతంలో షేక్ ఖైరున్ బీ గారి పేరుతో "డాటెడ్ ల్యాండ్" (రిజిస్ట్రేషన్కు నిలిపివేసిన భూమి) జాబితాలో ఉండేది. అయితే జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 05-04-2022న ఈ భూమిని ప్రైవేట్ పట్టా భూమిగా మార్చారు. కానీ, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పొరపాటున ఈ భూమిని మళ్లీ "డాటెడ్ ల్యాండ్స్ ఫ్రీహోల్డ్ డేటా" జాబితాలో చేర్చారు. దీంతో నా భూమికి సంబంధించిన రికార్డుల్లో ఇబ్బందులు ఏర్పడి, రిజిస్ట్రేషన్తో పాటు ఇతర రెవెన్యూ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.” దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఫ్రీహోల్డ్ డేటా నుంచి ఆ భూమని తొలగించాలని కోరుతూ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, సోమవరప్పాడు గ్రామానికి చెందిన పుచకాయల వెంకట రావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి... “మా ancestral ఆస్తి అయిన సర్వే నంబర్ 148/2 లో 1.38 ఎకరాలు మరియు సర్వే నంబర్ 150/1 లో 0.42 ఎకరాల భూమి విషయంలో, కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో అక్రమంగా మ్యుటేషన్లు చేయించుకున్నారు. దీనిపై రెవెన్యూ కోర్టును ఆశ్రయించాను. ఈ కేసుకు సంబంధించి అద్దంకి ఆర్.డి.ఓ 28 ఫిబ్రవరి 2026 న స్పష్టమైన తీర్పునిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 1. నా భూమికి సంబంధించి కాటకంశెట్టి వెంకటేశ్వర్లు, ఇతరుల పేర్ల మీద జరిగిన అనధికారిక మ్యుటేషన్లు, వెబ్ ల్యాండ్ నమోదులను పూర్తిగా రద్దు చేశారు. 2. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టం 1971 నిబంధనల ప్రకారం రెండు నెలల వ్యవధిలో పునర్విచారణ (Fresh Enquiry) జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని తాళ్ళూరు తహశీల్దార్ గారిని ఆదేశించారు. 3. అప్పటి వరకు ఆ భూమిని వివాదాస్పద భూముల రిజిస్టర్ (Disputed Land Register) లో ఉంచాలని ఆదేశించారు.” దీనిపై వేగంగా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన ఆకిరి ప్రసాద్ రావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి “ మండలంలోని కొప్పెర్ల గ్రామంలో తెలుగుదేశం సానుభూతి పరులకు ఇల్లుగాని, ఇంటి స్థలం గాని ఇప్పటి వరకు మంజూరు కాలేదు. గత వైసీపీ ప్రభుత్వం కావాలనే తమపై కక్ష గట్టి ఇల్లు ఇవ్వలేదు. గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 80 కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇల్లు నిర్మాణం కొరకు సేకరించిన భూమిలో కొంత భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఆ భూమిలో ఇళ్లు నిర్మిస్తారని కోరుతున్నాం. అలానే కొందరు ఇళ్లు అర్ధంతరంగా నిర్మించి ఆర్థిక సాయం లేక సగంలోనే నిలిపివేశారు. దీనిపై కూడా స్పందించి వారికి ఆసరా కల్పించాలి.” అని అర్జీ ఇచ్చారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react