⚡ BREAKING

Tobacco: వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలే లక్ష్యం.. వేలం కేంద్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు!

Tobacco: రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించి, వారికి గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Review Meeting On Tobacco
Review Meeting On Tobacco

పొగాకు కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష.. రైతులకు న్యాయం చేస్తాం..

పొగాకు వేలాల్లో అక్రమాలకు అడ్డుకట్ట.. కంపెనీలపై చర్యలకు మంత్రి ఆదేశం..

అమరావత: రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించి, వారికి గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు టొబాకో బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా కొన్ని వేలం కేంద్రాల్లో అధికంగా నమోదవుతున్న పొగాకు రిజెక్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలకు గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ నెల 9న టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ) ఆంధ్రప్రదేశ్కు రానున్న నేపథ్యంలో, రైతులు మరియు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల ద్వారా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలు రూపొందించాలని చెప్పారు.

పొగాకు వేలం కేంద్రాలను సంబంధిత మంత్రులు స్వయంగా సందర్శించి రైతులతో మాట్లాడాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అలాగే పొగాకు కొనుగోలు సంస్థల మధ్య సిండికేట్ వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వేలం ప్రక్రియలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీలపై టొబాకో బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వర్జీనియా పొగాకుకు న్యాయమైన ధర లభించేలా, రైతుల ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Tags

Be the first to react

Latest