నామినేషన్లకు వెళ్లే అభ్యర్థులకు ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్! ఎస్ఈసీ కీలక ప్రకటన!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతంలో నామినేషన్ల సమయంలో పలుచోట్ల చోటుచేసుకున్న ఘర్షణలు, అభ్యర్థులను అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక భద్రత కల్పించాలని నిర్ణయించింది.
- నామినేషన్ల సమయంలో ముప్పు ఉంటే అభ్యర్థులకు ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్.
- ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.15–25 లక్షల ప్రోత్సాహక నిధులు.
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతంలో నామినేషన్ల సమయంలో పలుచోట్ల చోటుచేసుకున్న ఘర్షణలు, అభ్యర్థులను అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక భద్రత కల్పించాలని నిర్ణయించింది.
అభ్యర్థులకు పోలీసుల ఎస్కార్ట్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. నామినేషన్లు సమర్పించేందుకు వెళ్లే అభ్యర్థులకు దాడుల భయం ఉన్నా, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసుల రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. తమకు ముప్పు ఉందని సంబంధిత ఎస్పీకి సమాచారం అందిస్తే.. అభ్యర్థులకు ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
12 జిల్లాల ఎస్పీలతో సమీక్ష
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పునేఠా పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత ఎన్నికల సమయంలో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సమస్యాత్మకంగా ఉన్న 12 జిల్లాల ఎస్పీలతో మాట్లాడి, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలిపారు.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు పునేఠా వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే శాంతిభద్రతలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు
పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన తాజా జీవో ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు అందించనుంది. 5 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు పునేఠా వివరించారు. రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇక ఈ నెల 19న ఎంపీపీలు, 20న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Be the first to react