హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నూతన కార్యాలయం.. సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి!
CM Revanth Reddy Visits New ABN Office: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మీడియా సంస్థల నూతన కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొత్త కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆయన కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నూతన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి.. రాధాకృష్ణకు శుభాకాంక్షలు..
వేమూరి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు.. ఆంధ్రజ్యోతి కొత్త కార్యాలయ సందర్శన..
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మీడియా సంస్థల నూతన కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. కొత్త కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నూతన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థ చైర్మన్ వేమూరి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
మీడియా సంస్థ నూతన కార్యాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధి మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.
అనంతరం ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అనూష, డైరెక్టర్ శ్రుతికీర్తిలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. నూతన కార్యాలయంలో కొత్తగా ప్రారంభమైన కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల నూతన కార్యాలయంలో సందడి నెలకొంది.
Tags
Be the first to react