అనంతపురానికి చెందిన జి. లక్ష్మీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. సుమారు 25 ఏళ్లుగా అనంతపురం పట్టణంలో కూలిపని చేసుకోని జీవనం సాగిస్తున్నాం. అప్పటి తహసీల్దార్ సర్వే నెం. 1966-2 ప్లాన్ నెం. 18 నివాసం కోసం 1 1/4 సెంట్ల స్థలం డిఫారం పట్టా మంజూరు చేశారు.
తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వలన అప్పట్లో ఇళ్లు నిర్మించుకోలేదు. కుటుంబ జీవనాధారం కోసంణ బెంగుళూరుకు వలస వెళ్లాం. 2000 సంవత్సరంలో తిరిగి అనంతపురం వచ్చాం. తన పేరు ఉన్న స్థలం తనపేరుపై ఉందో లేదో తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా తహసీల్దార్ ను అడిగాను.
సమాచార హక్కు చట్టం కింద ఎండార్స్ మెంట్ ద్వారా తమకు నకలు ఇంటి పట్టా మంజూరు చేశారు. తమ స్థలంలో షెడ్డు నిర్మించుకొని అందులో జీవనం సాగించాలని నిర్ణయించుకోని వెళ్ళగా మాజీ రౌడీషీటర్ అయిన షేక్ జావీద్ తమ తన అనుచరులతో దాడి చేసి తను వైసీపీ నాయకుడిని 37వ సచివాలయం కన్వీనరన్ గా ఉన్నాడు.
ప్రస్తుతం నగర మైనార్టీ విభాగ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఈ స్థలం అంతా తమదే తన భార్య అయిన బి. మౌనిక పేరుతో 0.03 సెంట్లు డిఫారం పట్టా వున్నాది. సంగాల నారాయణ స్వామితో 0.03 సెంట్ల స్థలం అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భార్య బి. మౌనిక పేరుతో రిజిస్ట్రేషన్ కార్యాలయం నందు రిజిస్టర్ చేసి పత్రాలు ఉన్నాయి. స్థలం అంతా తమదే అంటూ దౌర్జన్యం చేశాడు.
ఈ విషయంపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు గృహనిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల మంత్రి కొలుసు పార్ధసారధి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకల్ల నారాయణలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్లు 450-1 (0.46 సెంట్లు), 450-9 (0.21 సెంట్లు)లో మొత్తం 0.67 సెంట్ల సొంత భూమి ఉంది. ఈ భూమిని తమ కుమార్తె సర్వేపల్లి వెంకటరమణమ్మ (భర్త వెంకట సురేష్)కు పసుపు కుంకుమ కింద మనస్ఫూర్తిగా రాసి ఇచ్చాను.
కొడుకు కోటేశ్వరరావు ఎటువంటి చట్టపరమైన సంబంధం లేకపోయినా కూతురికి రాసిచ్చిన పొలంలోకి అలాగే అల్లుడు కష్టపడి కొనుక్కున్న సొంత పొలంలోకి కూడా దౌర్జన్యంగా ప్రవేశించి ఇబ్బందులు పెడుతున్నారు. 30 ఏళ్ల క్రితం కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిపై కూడా దౌర్జన్యానికి ప్రయత్నిస్తున్నాడు.
తనకు తెలియకుండా దొంగ పద్ధతిలో పట్టా పాస్ పుస్తకం (నెం: 539) చేయించి తన పేరు మీద 7.03 సెంట్ల భూమిని అక్రమంగా నమోదు చేయించాడు. కొడుకు దౌర్జన్యాన్ని అడ్డుకోవాలని బాలాయపల్లి తహసిల్దార్ ని, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొట్లూరి పద్మజ రాణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెం.133లోని మొత్తం య.7.45 సెంట్ల వ్యవసాయ భూమి కలదు. సరిహద్దు దారుల సమక్షంలో గతంలో ప్రభుత్వ అధికారులే ఈ భూమి తనదేనని ధృవీకరించారు.
కానీ గత 15 ఏళ్లుగా 2.20 సెంట్ల భూమిని గ్రామానికి చెందిన పొట్లూరి సత్యన్నారాయణ అన్యాయంగా ఆక్రమించుకొన్నాడు. గతంలో ఈ సమస్యపై ఫిర్యాదు చేయగా..గత సంవత్సరం సెప్టెంబరులో సర్వే నిర్వహించి భూమి తమదేనని అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ ఇటీవల ఈ నెల 4వ తేదీ) ఆక్రమణదారులు మళ్లీ భూమిపై దాడులు చేసి పనులు ఆపేశారు.
అదేవిధంగా ఈ నెల 7వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ రాత్రి సమయంలో పొలంలో అమర్చిన మోటారు పీకేసి తీసుకెళ్లడంతో పాటు పైప్ లైన్ కోసివేయడం, డీజిల్ దొంగతనం వంటి దాడులు చేస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన మణికుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం.358-1Bలో య.1.02 సెంట్లు పొలం ఉంది. డ్రోన్ సర్వేలో తమకు 0.05 సెంట్ల తగ్గింది. ఈ భూమి తమ సరిహద్దు దారులకు ఎక్కించారు. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవంచి తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామానికి చెందిన నతానియేలు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. చిమటవారిపాలంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెం. 397లో య.2.50 భూమిని బాగు చేసుకోని సాగు చేసుకోని జీవనం సాగిస్తున్నాను. ఈ పొలానికి సంబంధించి పట్టా ఇవ్వలేదు. ప్రస్తుతం జూటు పంట వేశాను. కావునా తమకు పట్టా ఇప్పించి భూమిపై హక్కుల కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చింతలగుంట గ్రామానికి చెందిన యశోదమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. చెంచుగుడి గ్రామం పరిధిలోని సర్వే నంబర్లు 216, 216/1, 216/6 లలో ఉన్న మొత్తం 3 ఎకరాల 50 సెంట్లు భూమి కలదు. ఈ భూమిలో వరి, ఉలవలు, జొన్నలు, కంది వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
పక్క ఊరివారైన బాలుపల్లె గ్రామానికి చెందిన ముకుంద రెడ్డి, అతని తమ్ముడు పురుషోత్తమం అనే వ్యక్తులు భూమి వద్దకు వచ్చి తమ కుటుంబాన్ని దుర్భాషలాడుతూ తిడుతూ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామానికి చెందిన రామలక్ష్మీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబరు 122లో య.1.50 సెంట్ల భూమిని తాము దాదాపు 45 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం.
అనేకసార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇంతవరకు పట్టా మంజూరు కాలేదు. పట్టా మంజూరు చేయించి ఆన్ లైన్‌లో నమోదు చేయించాలని అభ్యర్థించారు. అలాగే మాంత్రికి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబరు 180/15లో మొత్తం 0.50 సెంట్ల భూమికి తమకు గతంలో డి. పట్టా మంజూరు అయింది.
అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డులలో తన పేరు మీద 0.16 సెంట్లు మాత్రమే నమోదై ఉంది. కావునా తమయందు దయవుంచి మిగిలిన 0.34 సెంట్ల భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నందిగం వెంకటరత్నం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. పోలసానపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే155లో మొత్తం 10 ఎకరాలు 03 సెంట్ల భూమి కలిగి ఉన్నాను.
గ్రామ సర్వేయరు సర్వే నిర్వహించి తమ భూమి 10 ఎకరాలు 02 సెంట్లు ఉన్నట్లు తమకు అధికారిక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆన్‌లైన్ రికార్డుల్లో కేవలం 9 ఎకరాలు 91 సెంట్లే ఎక్కించారు దీని వల్ల మొత్తం 12 సెంట్ల భూమి రికార్డులో తగ్గిపోయింది.
అందులో 12 సెంట్లు నా భూమి ఉత్తర సరిహద్దు దారుడు చలసాని శ్రీనివాసరావు భూమిలో పడినట్లు ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. సరిహద్దు దారులు చలసాని శ్రీనివాసరావు, చలసాని దామోదరరావు వారి పత్రాలు పరిశీలించి తమకు రావాల్సిన మిగతా భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాపయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నం. 122 లో కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలు నిర్మించి గ్రామ దారిని పూర్తిగా మూసివేశారు.
ఎస్ఎస్ మాప్ ప్రకారం అక్కడ ప్రభుత్వ మార్గం ఉన్నప్పటికీ సర్వే రాళ్లు తొలగించి అనధికార నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల గ్రామస్థులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావునా అక్రమ కట్టడాలు తొలగించి సర్వే రాళ్లు పునరుద్ధరించి, ప్రభుత్వ మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తేవాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.