భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంటేనే వివో బ్రాండ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా 'Y' సిరీస్ ఫోన్లు తమ అందమైన డిజైన్ మరియు కెమెరా క్వాలిటీతో యువతను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ ఏడాది వివో తన పోర్ట్‌ఫోలియోలో అనేక ఫోన్లను లాంచ్ చేసినప్పటికీ, వివో Y400 ప్రో 5G (Vivo Y400 Pro 5G) మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
జూన్ నెలలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు వివో స్టోర్లలో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఒక ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు మరియు ధరపై ఒక లుక్కేయండి.
ధర మరియు అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు
ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పండుగ సీజన్ మరియు ఇయర్ ఎండ్ సేల్స్ నేపథ్యంలో బ్యాంక్ కార్డులపై మంచి తగ్గింపు లభిస్తోంది.
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్: రూ. 25,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: రూ. 27,999
డిస్కౌంట్ ఆఫర్: వివో వెబ్సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో HDFC లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే నేరుగా రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు బేస్ వేరియంట్‌ను రూ. 23,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్సెట్ ఫెస్ట్ గోల్డ్, ఫ్రీస్టైల్ వైట్, నెబులా పర్పుల్ వంటి మూడు అద్భుతమైన కలర్ వేరియంట్స్‌లో దొరుకుతుంది.
వివో Y400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు: ఈ హ్యాండ్సెట్ 6.77 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే వెట్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు.
4 సంవత్సరాల వరకు అప్డేట్స్: ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను పొందుతుంది.
50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా: కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.
మీకు రూ. 25 వేల బడ్జెట్లో ఒక స్టైలిష్ లుక్, కర్వ్డ్ డిస్ప్లే, మరియు మంచి కెమెరా కావాలనుకుంటే వివో Y400 ప్రో 5G ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా వివో ఇచ్చే లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఈ ఫోన్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తున్నాయి.