స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికో, సోషల్ మీడియా చూసుకోవడానికో మాత్రమే కాదు.. నేడు అది ఒక పవర్‌ఫుల్ గేమింగ్ మెషీన్. అయితే, హెవీ గేమింగ్ ఆడేవారికి ప్రధాన సమస్య 'బ్యాటరీ' మరియు 'హీటింగ్'. ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తూ ప్రముఖ చైనా బ్రాండ్ హానర్ (Honor) తన సరికొత్త 'హానర్ విన్' (Honor Win) మరియు 'హానర్ విన్ RT' (Honor Win RT) స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా లాంచ్ చేసింది.
సాధారణంగా 5000mAh బ్యాటరీ ఉంటేనే అది పెద్ద బ్యాటరీ అని అంటాం, కానీ హానర్ ఏకంగా 10,000mAh బ్యాటరీని ఈ ఫోన్లలో అమర్చి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఫోన్ల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. రెండు స్మార్ట్ఫోన్లలోనూ 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. హెవీ గేమింగ్, లాంగ్ డైలీ యూసేజ్కు ఎక్సలెంట్ ఎండ్యూరెన్స్ ఇస్తుందని హానర్ క్లెయిమ్ చేసింది.
100w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. హానర్ విన్లో అదనంగా 80w వైర్లెస్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫోన్ వెనుకభాగంలో కూలింగ్ ఫ్యాన్ హీట్ కంట్రోల్ చేస్తుంది. హానర్ విన్ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OSపై రన్ అవుతుంది. మల్టిపుల్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇచ్చింది.
రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. హానర్ విన్లో ట్రిపుల్ రియర్ కెమెరా (50MP మెయిన్, 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్) ఉంది. విన్ RTలో డ్యూయల్ రియర్ కెమెరా (50MP మెయిన్, 12ఎంపీ అల్ట్రా-వైడ్) ఉంది. రెండు ఫోన్లలోనూ 3D అల్ట్రాసానిక్ ఇన్-డిస్ప్లే ఫింగరింట్ సెన్సార్ ఉంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు హానర్ ఏఐ సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. 5G, వై-ఫై 7, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. IP68, IP69, IP69K రేటింగ్స్ డస్ట్, వాటర్, హై-ప్రెషర్ వాషింగ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.
ధరలు..
చైనా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ల ధరలు మన రూపాయిల్లో సుమారుగా ఇలా ఉన్నాయి:
హానర్ విన్ RT (Honor Win RT):
12GB+256GB: రూ. 34,500
16GB+1TB: రూ. 51,000
హానర్ విన్ (Honor Win):
12GB+256GB: రూ. 51,000
16GB+1TB: రూ. 66,500
హానర్ విన్ సిరీస్ నిజంగానే గేమర్ల కలల ఫోన్ అని చెప్పవచ్చు. 10,000mAh బ్యాటరీ మరియు కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలోకి వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.