Hyderabad: సాంకేతిక లోపంతో హైదరాబాద్-విజయవాడ ఫ్లైట్ ఆలస్యం.. విమానంలోనే గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ!
Hyderabad: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఫ్లై 91 విమానం సాంకేతిక లోపం కారణంగా నిర్ణీత సమయానికి టేకాఫ్ కాలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫ్లై 91 విమానంలో సాంకేతిక లోపం.. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల అవస్థలు..
హైదరాబాద్-విజయవాడ ఫ్లైట్ ఆలస్యం.. రెండున్నర గంటల పాటు విమానంలోనే ప్రయాణికుల నిరీక్షణ..
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఫ్లై 91 (Fly91) విమానం సాంకేతిక లోపం కారణంగా నిర్ణీత సమయానికి టేకాఫ్ కాలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం ప్రకారం, ఉదయం 7.45 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ నంబర్ IC 3301 టేకాఫ్కు సిద్ధమైన సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. అయితే సమస్య పరిష్కారానికి సమయం పడుతుండటంతో ప్రయాణికులు రెండున్నర గంటల పాటు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ ఆలస్యంపై ఎయిర్లైన్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం ప్రయాణికుల అసహనానికి కారణమైంది. ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రయాణానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు.
ఎక్కువసేపు విమానంలోనే ఉండాల్సి రావడంతో కొందరు ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయి తిరిగి టెర్మినల్కు వెళ్లిపోయారు. ఎయిర్లైన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రయాణికులకు సరైన సమాచారం అందించలేదని వారు విమర్శించారు.
సాంకేతిక లోపాన్ని సరిచేసే పనులు కొనసాగుతున్నాయని తెలిసింది. అయితే విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై ఎయిర్లైన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రయాణికులు మాత్రం ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా విమానయాన సంస్థలు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.
Tags
Be the first to react
