⚡ BREAKING

Flight Rules: విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన... భారతీయ ప్రయాణికుడికి 6 నెలల జైలు శిక్ష! ఫ్లైట్ రూల్స్ తెలియకపోతే అంతే...

Flight Rules: విమాన ప్రయాణాలలో కఠినమైన భద్రతా నిబంధనలు మరియు చట్టాలు అమలులో ఉంటాయనే కనీస అవగాహన లేకపోతే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలిపే ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ నుండి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక 35 ఏళ్ల భారతీయ ప్రయాణికుడు (తివారి) విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు సింగపూర్ కోర్టు అతనికి ఆరు నెలల కఠిన జైలు శిక్ష విధించింది. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు ఎంత క్రమశిక్షణతో మెలగాలో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

భారతీయ ప్రయాణికుడికి 6 నెలల జైలు శిక్ష
భారతీయ ప్రయాణికుడికి 6 నెలల జైలు శిక్ష
  • సింగపూర్ ఎయిర్లైన్స్ లో కలకలం.. ల్యాండ్ అవ్వగానే ఇండియన్ ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • బాధితురాలికి రూ.90 వేల జైలు జరిమానా.. జైలు పాలైన 35 ఏళ్ల భారతీయుడు

  • విమానంలో మితిమీరిన ప్రవర్తన.. పైలట్ హెచ్చరికతో టార్మాక్ పైనే చుట్టుముట్టిన పోలీస్ కార్లు

Flight Rules: విమాన ప్రయాణాలలో కఠినమైన భద్రతా నిబంధనలు మరియు చట్టాలు అమలులో ఉంటాయనే కనీస అవగాహన లేకపోతే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలిపే ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ నుండి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక 35 ఏళ్ల భారతీయ ప్రయాణికుడు (తివారి) విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు సింగపూర్ కోర్టు అతనికి ఆరు నెలల కఠిన జైలు శిక్ష విధించింది. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు ఎంత క్రమశిక్షణతో మెలగాలో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, సదరు ప్రయాణికుడు తన నలుగురు స్నేహితులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె విమానంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మరియు ఫుడ్, వాటర్ సర్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెను తాకుతూ, స్నేహితులతో కలిసి నవ్వుతూ వేధించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన ఇమ్మీడియట్ మేనేజర్ (స్టీవార్డ్) మరియు సూపర్వైజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సదరు వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా విమానంలోని గ్యాలరీ (సిబ్బంది పనిచేసే ప్రాంతం) లోనికి కూడా వెళ్లి ఆమెకు అత్యంత సమీపంగా నిలబడుతూ తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు.

సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికులతో ఎలాంటి గొడవలు లేదా అల్లర్లు జరగకుండా సిబ్బంది చాలా ఓపికతో వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే బస్సు లేదా ట్రైన్ లాగా విమానాన్ని మధ్యలో ఆపడం కుదరదు కాబట్టి, అత్యవసర ల్యాండింగ్ చేయాలన్నా చాలా సమయం పడుతుంది. అయితే ఈ ఘటనలో నిందితుడి ప్రవర్తన మితిమీరడం, సదరు ఎయిర్ హోస్టెస్ తీవ్ర మనస్తాపానికి గురై ఏడ్చేయడంతో సీనియర్ సిబ్బంది ఈ విషయాన్ని నేరుగా విమాన పైలట్ దృష్టికి తీసుకెళ్లారు. పైలట్ వెంటనే స్పందించి విమానం ల్యాండ్ కాబోయే సింగపూర్ ఎయిర్పోర్ట్ అధికారులకు మరియు అక్కడి పోలీసులకు ముందస్తు సమాచారం అందించారు.

విమానం సింగపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, సాధారణ ప్రయాణికులెవరినీ బయటకు వెళ్లనివ్వకుండా సింగపూర్ పోలీసులు నేరుగా విమానంలోకి ప్రవేశించారు. బాధితురాలు మరియు విమాన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కోర్టు విచారణ అనంతరం బాధితురాలికి జరిగిన మానసిక వేదనకు నష్టపరిహారంగా నిందితుడు 90 వేల రూపాయలను (భారత కరెన్సీ ప్రకారం) చెల్లించాలని ఆదేశించడంతో పాటు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతనికి ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది.

విదేశాలలో చట్టాలు, మహిళల భద్రతా నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ సంఘటన నిరూపిస్తోంది. సింగపూర్, మలేషియా వంటి దేశాలలో నేరాలకు జైలు శిక్షలతో పాటు 'కేన్స్' (కొరడా దెబ్బలు) వంటి కఠినమైన శిక్షలు కూడా విధిస్తుంటారు. ఒక్కసారి విదేశాలలో ఇలాంటి క్రిమినల్ రికార్డు నమోదైతే, భవిష్యత్తులో ఏ దేశానికి వెళ్లడానికి వీసాలు రావు మరియు కెరీర్ పూర్తిగా నాశనమవుతుంది. అందువల్ల విమానాలలో ప్రయాణించేటప్పుడు సిబ్బందిని గౌరవించాలని, విదేశీ సంస్కృతిలో వారు నవ్వుతూ పలకరించినంత మాత్రాన తప్పుగా భావించి మిస్ బిహేవ్ చేయకూడదని, ప్రయాణికులలో ఈ రకమైన అవేర్నెస్ (అవగాహన) కల్పించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest