LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Technology

PCB Color History: ఎలక్ట్రానిక్ బోర్డులు పచ్చగానే ఎందుకు ఉంటాయి? ఆసక్తికరమైన అసలు రహస్యం ఇదే!

PCB Color History: ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సర్క్యూట్ బోర్డులు పచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న హ్యూమన్ బయాలజీ, కోల్డ్ వార్ మిలిటరీ సీక్రెట్స్ సైంటిఫిక్ కారణాలను తెలుసుకోండి.

AndhraPravasi News Desk 2 min read
PCB Color History: ఎలక్ట్రానిక్ బోర్డులు పచ్చగానే ఎందుకు ఉంటాయి? ఆసక్తికరమైన అసలు రహస్యం ఇదే!

PCB Color History:  నేటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ నుంచి పాత కాలపు రేడియో అయినా.. దాని లోపల విప్పి చూస్తే మనకు మొదట కనిపించేది  పచ్చ రంగులో ఉన్న బోర్డు. దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్ అంటేనే ఈ 'గ్రీన్ కలర్' అన్నంతగా ఇది ముద్రపడిపోయింది. నిజానికి 'ద మ్యాట్రిక్స్' సినిమాలోని కోడింగ్ నుంచి పాత కాలపు కంప్యూటర్ స్క్రీన్ల వరకు అన్నీ పచ్చగానే ఉండేవి. అయితే, సర్క్యూట్ బోర్డులు ఎందుకు పచ్చగానే ఉంటాయనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మనం చూసే ఆ పచ్చదనం బోర్డు రంగు కాదు, దానిపై వేసే ఒక ప్రత్యేకమైన పూత మాత్రమే. లోపల అసలు బోర్డును చూస్తే అది వెన్న రంగులోనో లేదా చెక్క ముక్కలాగో కనిపిస్తుంది.

అసలు ఈ బోర్డు ఎలా తయారవుతుంది?

మనం పిలిచే పీసీబీ (PCB - Printed Circuit Board) అనేది ఒక రకమైన 'సాండ్‌విచ్' లాంటిది. దీని తయారీలో మొదట ఫెనోలిక్ పేపర్ లేదా రెసిన్‌తో కలిపిన చెక్క ఫైబర్‌ను వాడుతారు. ఇది చూడటానికి లేత గోధుమ రంగులో ఉంటుంది. దీనిపై ఒక సన్నని రాగి (Copper) పొరను అంటించి, కెమికల్స్ సాయంతో అవసరం లేని భాగాన్ని కరిగించేస్తారు. మిగిలిన ఆ రాగి గీతలే విద్యుత్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తాయి. పాత రోజుల్లో ఈ గోధుమ రంగు బోర్డులే వాడేవారు. కానీ టెక్నాలజీ పెరిగేకొద్దీ ఈ రాగి గీతలు గాలికి పాడైపోవడం, వెల్డింగ్ చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోయి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వంటి సమస్యలు మొదలయ్యాయి.

పచ్చ రంగు వెనుక ఉన్న సైన్స్

ఈ సమస్యను పరిష్కరించడానికి 1970వ దశకంలో 'సోల్డర్ మాస్క్' అనే రక్షణ కవచాన్ని కనిపెట్టారు. ఇది బోర్డుపై ఉండే రాగి గీతలను తుప్పు పట్టకుండా, గీతలు పడకుండా కాపాడుతుంది. అయితే దీనికి పచ్చ రంగునే ఎందుకు ఎంచుకున్నారనేది ముఖ్యం. పూర్వం ప్రతి బోర్డును మనుషులే భూతద్దం పట్టుకుని పరీక్షించాల్సి వచ్చేది. ఎర్రటి రంగు కళ్లకు స్ట్రెయిన్ ఇచ్చేది, నీలం రంగు చీకటిగా ఉండేది. కానీ ప్రకృతి సిద్ధంగా మన కళ్లు పచ్చ రంగులోని చిన్న చిన్న తేడాలను కూడా సులువుగా గుర్తించగలవు. మన పూర్వీకులు అడవిలో ఆకుల మధ్య తేడాలను కనిపెట్టడానికి ఈ శక్తిని వాడేవారు, అదే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో లోపాలను కనిపెట్టడానికి సాయపడుతోంది.

సైన్యం అడుగుజాడల్లో..

ఈ పచ్చ రంగు ఇంతలా పాపులర్ అవ్వడానికి అమెరికా మిలిటరీ కూడా ఒక కారణం. కోల్డ్ వార్ సమయంలో అంటే 1954 ప్రాంతంలో, సైనిక పరికరాలు ఏ రంగులో ఉంటే చదవడానికి వీలుగా ఉంటాయో తెలుసుకోవడానికి అమెరికా సైన్యం కొన్ని పరీక్షలు చేసింది. పచ్చటి రంగు మీద తెల్లటి అక్షరాలు ఉంటే వెలుతురులో అయినా, చీకటిలో అయినా స్పష్టంగా కనిపిస్తాయని వారు తేల్చారు. ఆ సమయంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను సైన్యం భారీగా కొనేది. దీంతో కంపెనీలన్నీ ఆర్డర్ల కోసం మిలిటరీ చెప్పినట్టే పచ్చ రంగు బోర్డులను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత సాధారణ ప్రజల కోసం చేసే బోర్డులను కూడా అదే రంగులో మార్చేశారు.

కెమికల్స్  ఖర్చు

టెక్నాలజీ పరంగా చూస్తే, గ్రీన్ సోల్డర్ మాస్క్ మిగిలిన రంగుల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కేవలం 0.1 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న గ్యాప్‌లను కూడా కచ్చితంగా కవర్ చేయగలదు. మిగిలిన రంగులతో పోలిస్తే ఇది చౌకగా దొరకడమే కాకుండా, ఎండబెట్టడానికి (Curing) కూడా తక్కువ సమయం తీసుకుంటుంది. నేడు ఆపిల్ వంటి కంపెనీలు తమ ఫోన్లలో స్టైలిష్‌గా ఉండాలని నలుపు రంగు బోర్డులను వాడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 90 శాతం బోర్డులు ఇప్పటికీ పచ్చగానే ఉంటున్నాయి. ఒక చిన్న ప్రమాదంలా మొదలైన ఈ రంగు, నేడు టెక్నాలజీకి గ్లోబల్ ఐకాన్‌గా మారిపోయింది.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…