Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల..

Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే!

Change Email ID: మీ పాత Gmail ఐడి పేరు "పిచ్చి పిచ్చిగా" ఉందని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. మన నిత్యజీవితంలో ఈమెయిల్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ, చాలా మంది తమ మొదటి ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసేటప్పుడు సరైన అవగాహన లేక వింత వింత పేర్లతో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాత ఈమెయిల్ ఐడిని మార్చుకోవడానికి గూగుల్ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

Published : 2026-04-09 19:55:00
  • Techno;ogy: "Cool" నుంచి "Professional" వరకు: మీ జిమెయిల్ ఐడిని సులభంగా మార్చుకోండి ఇలా!
     
  • మీ పాత ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలా?: కొత్త ఐడి క్రియేట్ చేయకుండానే పేరు మార్చే సింపుల్ ట్రిక్..

Change Email ID: మనలో చాలా మంది 2004 లేదా 2006 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు, పేరు ముందు "Cool" అని లేదా మరేదైనా పిచ్చి పేరుని జోడించి ఉంటారు. అప్పట్లో అది ఫ్యాషన్ అనిపించవచ్చు కానీ, ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చాక అదే ఈమెయిల్ ఐడిని వాడాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు ఇటువంటి అన్‌ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడిలు ఉంటే, హెచ్ఆర్ (HR) దృష్టిలో మన ఇంప్రెషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. కేవలం ఒక ఈమెయిల్ ఐడి సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ రాకపోవచ్చు అంటే ఎవరూ నమ్మరు, కానీ అది నిజం.

ఇన్నాళ్లూ ఉన్న సమస్య ఏమిటి?
ఇప్పటి వరకు మన జిమెయిల్ (Gmail) ఐడిలోని పేరును లేదా యూజర్ నేమ్‌ను నేరుగా మార్చుకునే అవకాశం లేదు. ఒకవేళ మార్చాలి అనుకుంటే కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ అలా చేస్తే ఒక పెద్ద సమస్య ఉంది: మన పాత ఈమెయిల్ ఐడి ఇప్పటికే చాలా బ్రాండ్స్ దగ్గర, స్నేహితుల దగ్గర లేదా కంపెనీల దగ్గర ఉంటుంది. వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయాలంటే పాత ఐడియే వాడాలి. మనం ఎవరెవరికి ఆ ఐడి ఇచ్చామో కూడా గుర్తుండదు. అందుకే పాత ఐడిని వదలలేక, కొత్తది వాడుకోలేక చాలా మంది సతమతమయ్యే వారు.

గూగుల్ తెచ్చిన కొత్త అఫీషియల్ అప్డేట్…
గూగుల్ సంస్థ యూజర్ల ఇబ్బందులను గమనించి, ఇప్పుడు అఫీషియల్ గా మన Gmail ఐడి పేరును మార్చుకునే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నిజంగా మన మీద గూగుల్ చూపించిన దయ అనే చెప్పాలి. ఈ ఫీచర్ ద్వారా మనం మన పాత ఈమెయిల్ ఐడిని మార్చుకోవడమే కాకుండా, పాత ఐడికి వచ్చే మెయిల్స్‌ను కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు.

Gmail ఐడి పేరు మార్చుకునే విధానం (Step-by-Step Guide)
మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగించి చాలా సులభంగా ఈ మార్పు చేయవచ్చు. 
ఆ స్టెప్స్ ఇవే:

  1. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి: ముందుగా మీరు ఏ ఈమెయిల్ ఐడిని మార్చాలనుకుంటున్నారో, ఆ అకౌంట్‌తో లాగిన్ అయి పైన ఉండే ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
  2. Manage Your Google Account: అక్కడ మీకు కనిపించే "Manage Your Google Account" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
  3. Personal Info: తర్వాత వచ్చే స్క్రీన్‌లో "Personal Info" (పర్సనల్ ఇన్ఫో) అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
  4. Email  సెక్షన్: కిందకి స్క్రోల్ చేస్తే మీకు "Email" అని కనిపిస్తుంది, దాని మీద టాప్ చేయండి.
  5. Google Account Email: అక్కడ మీ ప్రస్తుత ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న 'ఆరో' (Arrow) మార్కును క్లిక్ చేయండి.
  6. Change Email ID: అక్కడ మీకు "Change Google Account Email" అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  7. కొత్త పేరును ఎంచుకోండి: కిందకి స్క్రోల్ చేస్తే 'User Name' అని ఉంటుంది. అక్కడ మీకు నచ్చిన కొత్త ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి "Change Email ID" మీద ప్రెస్ చేయండి.

ముఖ్యమైన విషయాలు మరియు చిట్కాలు..
రెండు ఐడిలు పని చేస్తాయి: మీరు మీ ఈమెయిల్ ఐడి మార్చిన తర్వాత, పాత ఐడికి వచ్చే మెయిల్స్ కూడా మీకు అందుతాయి. అంటే మీరు ఒకేసారి పాతది మరియు కొత్తది రెండూ వాడుకోవచ్చు. ఇది ఇప్పటికే టెస్ట్ చేయబడిన ట్రిక్.
ప్రొఫెషనల్ పేరు కోసం ChatGPT వాడండి: ఈసారి కూడా ఏదో ఒక పేరు పెట్టేయకుండా, మంచి ప్రొఫెషనల్ పేరు కోసం చాట్ జీపీటీ (ChatGPT) సలహా తీసుకోండి.
అందరికీ రాకపోవచ్చు: ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ ఆప్షన్ అన్ని అకౌంట్లకు అందుబాటులో లేదు. కొంతమందికి ఈ మార్చుకునే ఆప్షన్ రావడం లేదని గమనించడం జరిగింది. మీ అకౌంట్లో ఈ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయండి.
ఇక ఆలస్యం చేయకుండా మీ పాత పిచ్చి పిచ్చి ఈమెయిల్ ఐడిలకు స్వస్తి చెప్పి, కొత్త ప్రొఫెషనల్ ఐడితో దూసుకుపోండి!

Spotlight

Read More →