Sports: తిరుపతిలో అత్యాధునిక "పింగ్ పాంగ్" టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభం.. యువ క్రీడాకారులకు కొత్త వేదిక!
Sports: తిరుపతి నగరంలో టేబుల్ టెన్నిస్ క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన "పింగ్ పాంగ్" టేబుల్ టెన్నిస్ అకాడమీని సాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షురాలు బడి సుధా యాదవ్తో కలిసి గురువారం ప్రారంభించారు.
సాప్ చైర్మన్ రవి నాయుడు చేతుల మీదుగా పింగ్ పాంగ్ అకాడమీ ప్రారంభోత్సవం..
టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం..
తిరుపతి: తిరుపతి నగరంలో టేబుల్ టెన్నిస్ క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన "పింగ్ పాంగ్" టేబుల్ టెన్నిస్ అకాడమీని సాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షురాలు బడి సుధా యాదవ్ తో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అకాడమీని పరిశీలించిన రవి నాయుడు, అందుబాటులో ఉన్న ఆధునిక క్రీడా సౌకర్యాలను అభినందించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా అకాడమీలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి వంటి క్రీడలకు అనుకూలమైన నగరంలో అత్యాధునిక సదుపాయాలతో ఆరు టేబుల్ టెన్నిస్ టేబుళ్లను ఏర్పాటు చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రవి నాయుడు అన్నారు. ఈ అకాడమీ నిర్వహణకు కృషి చేసిన యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అకాడమీ ద్వారా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు తయారవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన శిక్షణ, ఆధునిక సదుపాయాలు యువ క్రీడాకారుల ప్రతిభను మరింత మెరుగుపరుస్తాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవి నాయుడు తెలిపారు. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి అకాడమీలు భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దే శిక్షణ కేంద్రాలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ, అకాడమీ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కూటమి నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కొత్త అకాడమీ ప్రారంభంతో తిరుపతిలో టేబుల్ టెన్నిస్ క్రీడకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Be the first to react