Chess: కనిజ్సా ఓపెన్‌-2026 టైటిల్‌ భారత్‌ ఖాతాలోకి.. ఛాంపియన్‌గా గ్రాండ్‌మాస్టర్‌ ప్రణేష్‌!

Chess: భారత యువ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణేష్‌ ఎం అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. హంగేరీలోని నాగీకానిజ్సాలో జరిగిన ప్రతిష్ఠాత్మక కనిజ్సా ఓపెన్‌-2026లో గ్రూప్‌-ఏ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ల ప్రణేష్‌ అద్భుతమైన ఆటతీరుతో టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచాడు.

Chess
Chess

హంగేరీలో సత్తా చాటిన 19 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్..

జర్మనీ ఆటగాడిపై విజయం.. కనిజ్సా ఓపెన్ విజేతగా ప్రణేష్ ఎం..

హంగేరీ: భారత యువ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రణేష్‌ ఎం అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. హంగేరీలోని నాగీకానిజ్సాలో జరిగిన ప్రతిష్ఠాత్మక కనిజ్సా ఓపెన్‌-2026లో గ్రూప్‌-ఏ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ల ప్రణేష్‌ అద్భుతమైన ఆటతీరుతో టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచాడు.

తొమ్మిది రౌండ్ల పాటు సాగిన పోటీలో చివరి రౌండ్‌ వరకు ఉత్కంఠ కొనసాగింది. నిర్ణాయకమైన తొమ్మిదో రౌండ్‌లో జర్మనీకి చెందిన వాడిమ్‌ పెట్రోవ్‌స్కీపై ప్రణేష్‌ తెల్ల పావులతో విజయం సాధించాడు. దీంతో మొత్తం తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

టైబ్రేక్‌తో టైటిల్‌ ప్రణేష్‌కు
టోర్నీలో ప్రణేష్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ప్రణేష్‌కు టైటిల్‌ను అందించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓర్‌ బ్రోన్‌స్టీన్, ఉక్రెయిన్‌ ఆటగాడు ఆండ్రెయ్‌ వొలోకిటిన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ కార్తిక్‌ వెంకటరామన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. టైబ్రేక్‌ ఆధారంగా ప్రణేష్‌ విజేతగా నిలిచి కనిజ్సా ఓపెన్‌ టైటిల్‌ను అందుకున్నాడు.

ఫిడే ర్యాంకింగ్స్‌లో 44వ స్థానం
తమిళనాడులోని కారైకుడికి చెందిన ప్రణేష్‌ ప్రస్తుతం 2673 రేటింగ్‌తో కొనసాగుతున్నాడు. ఆగస్టు 2026లో విడుదలైన తాజా ఫిడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రణేష్‌.. కనిజ్సా ఓపెన్‌ విజయంతో తన ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను చేర్చుకున్నాడు.

భారత చెస్‌కు మరో ఘనత 
ప్రణేష్‌ విజయం పట్ల హంగేరిలోని భారత రాయబార కార్యాలయం అభినందనలు తెలిపింది. యువ గ్రాండ్‌మాస్టర్‌ సాధించిన ఈ విజయాన్ని ప్రశంసించింది. 19 ఏళ్ల వయసులోనే బలమైన అంతర్జాతీయ ఆటగాళ్ల మధ్య పోటీపడి టైటిల్‌ సాధించడం భారత చెస్‌ భవిష్యత్తుపై మరింత ఆశలు పెంచుతోంది. కనిజ్సా ఓపెన్‌లో చివరి రౌండ్‌ వరకు పోరాడి, టైబ్రేక్‌లో పైచేయి సాధించడం ప్రణేష్‌ ఆటలోని స్థైర్యానికి నిదర్శనంగా నిలిచింది.    

Tags

Be the first to react

Latest