Cricket viral video: వాట్ ఏ క్యాచ్.. గాల్లో పక్షిలా ఎగిరిన గిల్.. వీడియో వైరల్! తొలి ఇన్నింగ్స్‌లో 462 ర‌న్స్‌కు..

Cricket viral video: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 462 ర‌న్స్‌కు...
తొలి ఇన్నింగ్స్‌లో 462 ర‌న్స్‌కు...
  • తొలి ఇన్నింగ్స్‌లో 462 ర‌న్స్‌కు ఆలౌటైన టీమిండియా..
  • Sports: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గిల్ అద్భుత క్యాచ్...

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఎక్స్‌ట్రా కవర్ ఫీల్డింగ్ చేస్తున్న గిల్, గాల్లోకి పక్షిలా ఎగిరి అసాధారణ రీతిలో అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ క్రీజు వదిలి ముందుకు వచ్చి బంతిని డ్రైవ్ చేశాడు. బంతి వేగంగా నేలను తాకడానికి సిద్ధమవుతున్న తరుణంలో గిల్ తన ఎడమవైపునకు పూర్తిగా డైవ్ చేసి గాల్లోనే బంతిని ఒడిసిపట్టాడు. బంతి చేజారకుండా నేలకు తాకకుండా పట్టుకున్న తీరు అద్భుతం. 

ఈ క్యాచ్ చూసిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "వావ్, ఆ క్యాచ్ పట్టడానికి అతనికి ఎలాంటి అవకాశం లేదు. నిజానికి అది అతనికి అందే దూరంలోనే లేదు. బ్యాటర్ కూడా బంతి గాల్లోకి లేచింది కానీ సురక్షితమే అనుకుని ఉంటాడు. ఆ ప్రాంతంలో మీరు చూసే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి" అని ప్రశంసించాడు.

ఇక‌, ఈరోజు భారత తొలి ఇన్నింగ్స్ అత్యంత వేగంగా ముగిసింది. ఆట ప్రారంభమైన కేవలం నాలుగు బంతుల్లోనే శ్రీలంక పేసర్ అసిత్ ఫెర్నాండో భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఓవర్‌నైట్ స్కోరు 460/9తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. ఆట మొదలైన మూడు నిమిషాల్లోనే ఇన్నింగ్స్ ముగిసింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్‌కు కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే జోడించి టీమిండియా త‌న చివ‌రి వికెట్‌ను కూడా కోల్పోవ‌డంతో భారత ఇన్నింగ్స్ 462 పరుగుల వద్ద ముగిసింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జ‌ట్టుకు ఆరంభం నుంచే భార‌త బౌల‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. వ‌రుస విరామాల్లో వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో భోజ‌న విరామానికి ఆతిథ్య జ‌ట్టు 90 ప‌రుగుల‌కే కీల‌కమైన 5 వికెట్లు పారేసుకుంది. 

Tags

Be the first to react

Latest