2030 Commonwealth: 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లోనే.. అహ్మదాబాద్‌కు జెండా, బాధ్యతల అప్పగింత!
2030 Commonwealth: 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీకి అధికారిక కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 2030లో జరగనున్న శతాబ్ది (100వ వార్షిక) కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌కు నిర్వహణ బాధ్యతలను అధికారికంగా అప్పగించారు.
అహ్మదాబాద్ 2030 కామన్వెల్త్ గేమ్స్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. భారత్‌కు అధికారికంగా బాధ్యతలు..
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగింపు.. 2030 క్రీడలకు భారత్‌కు అధికారిక ఆహ్వానం..
అహ్మదాబాద్: 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీకి అధికారిక కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 2030లో జరగనున్న శతాబ్ది (100వ వార్షిక) కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌కు నిర్వహణ బాధ్యతలను అధికారికంగా అప్పగించారు.
ముగింపు వేడుకల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక కళా వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనతో ప్రపంచ దేశాలకు అహ్మదాబాద్‌కు ఆహ్వానం పలికింది భారత్. భారతీయ తత్వం, సంస్కృతి, ఆధునిక అభివృద్ధి సమ్మేళనంగా రూపొందించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బ్రిటన్ రాజు చార్ల్స్-III తరఫున హాజరైన ప్రిన్స్ ఎడ్వర్డ్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో జరిగే 24వ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాలని అన్ని దేశాల క్రీడాకారులకు ఆయన పిలుపునిచ్చారు.
భారత్‌కు అధికారికంగా ఆతిథ్య బాధ్యతలు
ముగింపు వేడుకల్లో కామన్వెల్త్ గేమ్స్ జెండాను సంప్రదాయబద్ధంగా బదిలీ చేసే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్కాట్లాండ్, భారత జాతీయ పతాకాలను మోసుకొచ్చిన ప్రతినిధుల మధ్య కామన్వెల్త్ జెండాను వేదికపైకి తీసుకువచ్చారు.
అనంతరం గ్లాస్గో లార్డ్ ప్రొవోస్ట్ జాక్వెలిన్ మెక్‌లారెన్ నుంచి కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ ఉపాధ్యక్షురాలు సుసాన్ జాక్సన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, చివరగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవికి జెండాను అందజేశారు. ఈ కార్యక్రమంతో స్కాట్లాండ్ నుంచి భారత్‌కు కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా బదిలీ అయ్యాయి.
20 ఏళ్ల తర్వాత భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్
భారత్ చివరిసారిగా 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్‌కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి ఈ మెగా క్రీడా వేడుకలను నిర్వహించే అవకాశం భారత్‌కు లభించింది. 2030లో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో శతాబ్ది సంచికగా నిలవనున్నాయి.
గ్లాస్గోలో భారత్‌కు 39 పతకాలు
11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 39 పతకాలు సాధించి భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత జట్టు, ఇప్పుడు 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతోంది. క్రీడలతో పాటు భారత సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఈ గేమ్స్ నిలవనున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Be the first to react