Quantum Valley: అమరావతికి సరికొత్త రికార్డు...దేశంలోనే ఫస్ట్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్!
Quantum Valley: భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతి క్వాంటం వ్యాలీ ఒక చారిత్రాత్మక విజయం సాధించింది. క్వాంటం ప్రయోగాలకు అవసరమైన అతిశీతల వాతావరణాన్ని (-269°C లేదా 4 కెల్విన్) సృష్టించే 'డైల్యూషన్ రిఫ్రిజిరేటర్'ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో మేధా టవర్స్ లోని స్టార్టప్స్ అభివృద్ధి చేశాయి. ఈ విజయంతో దేశీయ క్వాంటం పరిశోధనల అవసరాల్లో 85 శాతాన్ని అమరావతి నుంచే తీర్చవచ్చు.
- అమరావతికి క్యూ కడుతున్న ఐబీఎం, టీసీఎస్.. క్వాంటం టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్!
- మేధా టవర్స్ కేంద్రంగా క్వాంటం ప్రయోగాలు.. చారిత్రక విజయం సాధించిన ఏపీ స్టార్టప్స్.
- సీఎం చంద్రబాబు విజన్.. దేశీయ క్వాంటం కంప్యూటింగ్ రంగానికి కేంద్రంగా రాజధాని
Quantum Valley: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైజ్ఞానిక మరియు సాంకేతిక రంగంలో ఒక అద్భుతమైన చారిత్రక రికార్డును నమోదు చేసింది. భవిష్యత్తు సాంకేతికతగా భావించే క్వాంటం కంప్యూటింగ్ రంగంలో అగ్రరాజ్యాలకు దీటుగా మన దేశం అడుగులు వేస్తోంది. సాధారణంగా క్వాంటం పరికరాల పరిశోధనలు, ప్రయోగాలు చేయడానికి మైనస్ డిగ్రీల అత్యంత శీతల వాతావరణం అవసరం అవుతుంది. ఇందుకోసం ఉపయోగించే 'డైల్యూషన్ రిఫ్రిజిరేటర్' (Dilution Refrigerator) వ్యవస్థల కోసం మన దేశం ఇప్పటివరకు పూర్తిగా విదేశాల పైనే ఆధారపడేది. కానీ మొదటిసారిగా అమరావతి క్వాంటం వ్యాలీ దేశీయ పరిజ్ఞానంతో ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌ను విజయవంతంగా సృష్టించి ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు మేధా టవర్స్ కేంద్రంగా క్యూబిట్, క్యూ ఫోర్స్ అనే రెండు స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం టెంపరరీ క్యాంపస్‌లలో అవకాశం కల్పించింది. ఈ సంస్థలు చేసిన నిరంతర పరిశోధనల ఫలితంగానే ఇప్పుడు ఈ దేశీయ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ ప్రాజెక్ట్ సాకారమైంది. క్వాంటం చిప్‌లు మరియు అప్లికేషన్లను ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే అతిశీతల వాతావరణం తప్పనిసరి. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఏకంగా మైనస్ 269 డిగ్రీల సెంటీగ్రేడ్ (-269°C) అనగా 4 కెల్విన్ (4 Kelvin) ఉష్ణోగ్రతను విజయవంతంగా సృష్టించి దేశీయంగా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ తరహాలో పనిచేసే ఈ వ్యవస్థ సక్సెస్ అవ్వడాన్ని శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పురోగతిగా అభివర్ణిస్తున్నారు.
ఇంతకాలం విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన మన దేశానికి, ఈ ప్రయోగం ఒక ఆశాకిరణం లాంటిది. 'మేడ్ ఇన్ అమరావతి, ఫర్ ది వరల్డ్' (అమరావతిలో తయారీ, ప్రపంచం కోసం) అనే గొప్ప నినాదంతో ఈ క్వాంటం ప్రయోగాలు చురుకుగా జరుగుతున్నాయి. ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ 100 శాతం సక్సెస్ అవ్వడంతో, ఇకపై మన దేశంలో జరిగే క్వాంటం పరిశోధనలకు అవసరమైన 85 శాతం సాంకేతిక మద్దతును కేవలం అమరావతి క్వాంటం వ్యాలీ మాత్రమే అందించే గొప్ప సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన 15 శాతం మాత్రమే విదేశీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీపై ఆధారపడాల్సి ఉంటుందని, తద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' కలను అమరావతి నిజం చేయబోతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమరావతిలో పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. ఈ క్వాంటం వ్యాలీ నిర్మాణంలో ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) వంటి ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు జపాన్ దేశానికి చెందిన పలు ప్రఖ్యాత సంస్థలు, బెంగళూరుకు చెందిన కంప్యూటర్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటికే ఐబీఎం కు చెందిన ఒక క్వాంటం కంప్యూటర్ కూడా సిద్ధంగా ఉందని, పర్మనెంట్ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అది వేచి చూస్తోందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ జర్నీ, భవిష్యత్తులో దేశీయంగా క్వాంటం కంప్యూటర్ల తయారీకి అమరావతిని ప్రధాన కేంద్రంగా మార్చబోతోంది.
ఈ స్వదేశీ టెక్నాలజీ విజయంతో అమరావతి క్వాంటం వ్యాలీకి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించనుంది. గత ఆరు నెలల్లోనే మేధా టవర్స్ ఎస్టాబ్లిష్మెంట్‌లో అనేక ప్రయోగాలు విజయవంతంగా జరిగాయి. ఈ రంగంలో వస్తున్న పురోగతిని చూసి, ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో పలు భారీ కంపెనీలు క్వాంటం రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ఆసక్తిని కనబరిచాయి. ఈ తాజా డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సక్సెస్ అనేది మొత్తం క్వాంటం రంగానికి ఒక అద్భుతమైన బూస్ట్‌గా పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అతి త్వరలోనే సాంకేతిక యుగంలో అమరావతి క్వాంటం వ్యాలీ రెపరెపలు దేశవిదేశాల్లో ఎగరబోతున్నాయని వైజ్ఞానిక వర్గాలు గర్వంగా తెలియజేస్తున్నాయి.
Tags
Be the first to react