Buddha Venkanna: అరాచక పాలనకు పేటెంట్ రైట్ ఆయనదే... జగన్ సోషల్ మీడియా పోస్టులపై టీడీపీ తీవ్ర ఆగ్రహం!
Buddha Venkanna: వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- Politics: దాడులు చేసిన వారిని సమర్థించడం సిగ్గుచేటు అన్న బుద్దా వెంకన్న..
- జడ్జి రిమాండ్ విధించడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శ..
Buddha Venkanna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులకు పాల్పడుతుంటే... ఆ అక్రమాలను ఖండించాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా సమర్థిస్తూ పోస్టులు పెట్టడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ నాయకుల అరాచకాలను వెనుకేసుకురావడం జగన్ నైజమని, చట్టం ముందు అందరూ సమానులేనన్న కనీస స్పృహ ఆయనకు లేదని అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడూతూ మండిపడ్డారు.
కర్నూలు దళిత వ్యక్తి ఇంటిపై దాడి ఉదంతం: 'ఎమ్మెల్యేకి ఒక చట్టం.. సామాన్యులకు మరో చట్టమా?'
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ బుద్ధా వెంకన్న పోలీసుల చర్యను సమర్థించారు. వ్యక్తిగత దూషణల సాకుతో ఒక దళిత వ్యక్తి ఇంటిపై పడి దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే మరియు ఆ పార్టీ నాయకులపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు చట్టప్రకారం విచారణ జరిపారని స్పష్టం చేశారు.
న్యాయస్థానం రిమాండ్: బాధితుడి ఫిర్యాదు, ఆధారాలు మరియు వీడియోల ఆధారంగా న్యాయమూర్తి పరిశీలించిన తర్వాతే నిందితులకు రిమాండ్ విధించారని తెలిపారు.
చట్టం అందరికీ ఒకటే: "ఒక ఎమ్మెల్యేకి ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదు జగన్" అని స్పష్టం చేశారు. కోర్టు తీర్పును, పోలీసుల విచారణను అరాచక పాలనగా చిత్రీకరించేందుకు జగన్ ప్రయత్నించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
స్పష్టమైన ఆధారాలు: ఇంట్లో చొరబడి వస్తువులను ధ్వంసం చేసిన వీడియోలు కళ్లముందే కనిపిస్తుంటే జగన్ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
చంపిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చే సంస్కృతి జగన్‌దే!
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన పలు ఘటనలను బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఉదంతంలో బాధితులను బెదిరించినప్పుడు కూడా జగన్ అదే విధంగా సమర్థించారని విమర్శించారు.
బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు:
"సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడం మన ఆనవాయితీ. కానీ, దాడి చేసి చంపిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చడం ఒక్క వైఎస్ జగన్‌కే చెల్లింది. అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్నది జగన్‌కే."
వైసీపీ పాలనలో సాగిన అరాచకాలను, హింసను తట్టుకోలేకే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని 151 సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
డీఎస్సీ సవాల్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదా?
నారా లోకేశ్ విసిరిన మెగా డీఎస్సీ (DSC) సవాల్‌పై అసెంబ్లీకి వచ్చి నేరుగా చర్చించే ధైర్యం లేకనే జగన్ తన అనుచరులతో మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరికి విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా ఎస్సైపై వైసీపీ నేత దాడికి యత్నించిన ఘటన చోటుచేసుకున్నా జగన్ నోరు మెదపకపోవడం, ఆ దాడిని ఖండించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని బుద్ధా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Be the first to react