Amaravati Development: పోల్-ఫ్రీ క్యాపిటల్ సిటీగా రాజధాని అమరావతి... ఇక ఆ సమస్యలకు చెక్!
Amaravati Development: రాజధాని అమరావతి దేశంలోనే మొదటి 'పోల్-ఫ్రీ' (విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు లేని) నగరంగా రూపుదిద్దుకుంటోంది. రూడ్ల కింద కాంక్రీట్ యూటిలిటీ డక్ట్స్ నిర్మించి విద్యుత్, ఆప్టిక్ ఫైబర్, గ్యాస్, వాటర్, డ్రైనేజీ లైన్లన్నింటినీ భూగర్భంలోనే కన్సీల్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కొత్త కేబుల్స్ కోసం రోడ్లు తవ్వాల్సిన అవసరం ఉండదని మరియు తుఫానులను తట్టుకునే సురక్షిత నెట్‌వర్క్ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఇకపై ఏ పనికీ రోడ్లు తవ్వాల్సిన పనిలేదు: అమరావతి మాస్టర్ ప్లాన్‌లో గ్రిడ్ సిస్టమ్.
హై-టెన్షన్ విద్యుత్ టవర్ల తొలగింపు: భూగర్భంలోకి పవర్ లైన్లు, మిగిలనున్న వందల ఎకరాలు!
రైతుల ఎల్పీఎస్ లేఅవుట్లలో భూగర్భ వ్యవస్థలు: అధునాతన మౌలిక వసతులు
Amaravati Development: రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నగర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వినూత్న అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందిస్తున్నారు. సాధారణ నగరాల్లోలాగా వీధుల్లో, ప్రధాన రహదారుల్లో విద్యుత్ స్తంభాలు, ఇంటర్నెట్ తీగలు, కేబుల్ వైర్లు వేలాడే పరిస్థితి అమరావతిలో ఎక్కడా కనిపించదు. వీధి దీపాల స్తంభాలు మినహా మిగిలిన సకల విద్యుత్, టెలికాం, ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ లైన్లన్నింటినీ పూర్తిస్థాయిలో భూగర్భం (Underground) గుండానే అమర్చేలా పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
అమరావతిలో రహదారుల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతోందనే ప్రశ్నకు అసలు కారణం ఈ అండర్ గ్రౌండ్ డక్ట్ సిస్టమే. సీడ్ యాక్సిస్ రోడ్ సహా ప్రధాన రహదారులు, రైతులకు కేటాయించే ల్యాండ్ పూలింగ్ (LPS) లేఅవుట్లలో ముందుగా భూగర్భంలో భారీ "యూటిలిటీ డక్ట్స్, టన్నెల్స్" (Utility Ducts & Tunnels) ని నిర్మిస్తున్నారు. కాంక్రీట్ డక్ట్ల ద్వారా కేబుల్స్, పైప్‌లైన్లను భద్రపరిచిన తర్వాత మాత్రమే పైన రహదారులను నిర్మిస్తున్నారు. హెవీ డ్యూటీ (హై టెన్షన్) విద్యుత్ లైన్లను కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారానే తీసుకెళ్లాలని నిర్ణయించడంతో, విద్యుత్ టవర్ల తొలగింపు ద్వారా రాజధానికి భారీగా భూమి అందుబాటులోకి వస్తోంది.
ఈ అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్ట్ వ్యవస్థలో కేవలం విద్యుత్ వైర్లే కాకుండా, అత్యంత నాణ్యమైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్, తాగునీటి సరఫరా లైన్లు, డ్రైనేజీ వాటర్ మేనేజ్‌మెంట్, వర్షపు నీటి నిల్వ (Storm Water) వ్యవస్థలు మరియు గ్యాస్ పైప్‌లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వ్యవస్థకు దేనికది ప్రత్యేకమైన గ్రిడ్ మరియు డక్ట్‌ను కేటాయించారు. దీనివల్ల తాగునీటిలో మురుగునీరు కలవడం లేదా విద్యుత్ వైర్లతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగడం లాంటి సమస్యలకు ఆస్కారమే ఉండదు. భవిష్యత్తులో ఐటీ, క్వాంటం వ్యాలీ సంస్థల కోసం డిజిటల్ నెట్‌వర్క్‌ను ప్రత్యేక జాగ్రత్తలతో తీర్చిదిద్దుతున్నారు.
ఈ అండర్ గ్రౌండ్ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో అమరావతిలో అతిపెద్ద ప్రయోజనం దక్కనుంది. సాధారణంగా మన దేశంలో కొత్త కేబుల్స్ వేయాలన్నా లేదా రిపేర్లు చేయాలన్నా పదే పదే రోడ్లను తవ్వడం పరిపాటి. కానీ అమరావతిలో ఈ యూటిలిటీ డక్ట్స్ ఉండటం వల్ల ఒక్కసారి రోడ్డు నిర్మించిన తర్వాత ఏ పనికోసమూ రోడ్డును తవ్వాల్సిన అవసరమే ఉండదు. కేవలం ఇంటర్నల్ కనెక్టింగ్ పాయింట్ల ద్వారానే కొత్త నెట్‌వర్క్ కనెక్షన్లు ఇస్తారు. ఇది నగర నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు రోడ్ల మన్నికను పెంచుతుంది.
వరదలు, తీవ్ర తుఫానులు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా, సురక్షితమైన అండర్ గ్రౌండ్ గ్రిడ్ సిస్టమ్‌ను అమరావతిలో అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం నేలమట్టం కింద (Underground Activity) భారీ స్థాయిలో నిర్మాణాలు సాగుతున్నందునే, పైకి అభివృద్ధి కనిపించడానికి కొంత సమయం పడుతోంది. ఈ అండర్ గ్రౌండ్ పనులన్నీ కన్సీల్ అయి హ్యాండ్‌ఓవర్ పూర్తయిన తర్వాత అమరావతి స్కైలైన్ (అంబరం) ఎంతో అందంగా, క్లియర్ స్కైతో మిగతా నగరాల కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Be the first to react