Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ వెలుగులు.. ఆస్ట్రేలియాతో 4 బిగ్ డీల్స్.. లోకేశ్ ప్లాన్ సూపర్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇరుప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే లక్ష్యంగా నాలుగు కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి.

ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ వెలుగులు: ఆస్ట్రేలియాతో 4 బిగ్ డీల్స్.. లోకేశ్ ప్లాన్ సూపర్!
ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ వెలుగులు: ఆస్ట్రేలియాతో 4 బిగ్ డీల్స్.. లోకేశ్ ప్లాన్ సూపర్!
  • యువతకు ప్రపంచస్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్..

  • Politics: ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు కీలక రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందాలు..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి దిశగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో ఏపీ బంధం మరింత పటిష్టమవుతూ, రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణలే లక్ష్యంగా 4 కీలక రంగాల్లో వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన చర్చలకు ఇవి కార్యాచరణ రూపమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది.

దేశానికే సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!
పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సరికొత్త శక్తిగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. ఐఐటీ తిరుపతి (IIT Tirupati), ఏపీ ప్రభుత్వానికి చెందిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలేన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్' (CoEET), ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ సిడ్నీ యూఎన్ఎస్ డబ్ల్యూ (UNSW) విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏపీలో "సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలేన్స్" ను ఏర్పాటు చేయనున్నాయి.

  • అత్యాధునిక పరిశోధనలు: సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) తయారీ, రీసైక్లింగ్ సాంకేతికతపై పరిశోధనలు.

  • గ్లోబల్ ట్రైనింగ్: గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, విద్యార్థులకు హై-టెక్ స్కిల్స్ శిక్షణ.

ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం
"ప్రతి చిన్నారి నేర్చుకోవడానికి, స్వేచ్ఛగా ఎదగడానికి అర్హులు" అనే ప్రాథమిక సూత్రంతో విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆటిజం (Autism) మరియు ఇతర న్యూరోడైవర్స్ (Neurodiverse) అభ్యసన అవసరాలున్న పిల్లల కోసం సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు UNSW సిడ్నీ, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సమగ్ర శిక్ష ఏపీ సంయుక్తంగా పనిచేస్తాయి. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక బోధనా శిక్షణ అందించనున్నారు.

మరోవైపు, విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి (Mental Health) ప్రాధాన్యతనిస్తూ 'రౌండ్ డింపుల్' సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. దీని ద్వారా విద్యార్థులు గోప్యంగా వర్చువల్ కౌన్సెలింగ్, వెల్‌నెస్ అసెస్‌మెంట్ సేవలను పొందవచ్చు.

ప్రపంచస్థాయి ఉద్యోగాలకు ఏపీ యువత సంసిద్ధం!
ఏపీ యువతకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆస్ట్రేలియాకు చెందిన 'డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్' మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

వృత్తి విద్యా కోర్సులు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా వృత్తిపరమైన ధ్రువపత్రాలు (Professional Certifications) అందించడం ద్వారా గ్లోబల్ కెరీర్‌లకు మన యువతను సిద్ధం చేయనున్నారు. ప్రతిభ, ఆవిష్కరణలే పునాదిగా ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్తును సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Tags

Be the first to react

Latest