నిన్న 73 వేల మందికి శ్రీవారి దర్శనం..
శ్రీవారి సేవలో వేలాది మంది భక్తులు..
సర్వదర్శనానికి 14 గంటలు.. శీఘ్రదర్శనానికి 4 గంటల సమయం!
Tirumala Update: తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 12 నుండి 14 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు కలిగిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry) భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతోంది.
మంగళవారం ఒక్కరోజే స్వామివారిని 73,572 మంది భక్తులు దర్శించుకోగా 22,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి ₹4.38 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ (TTD) నిరంతరాయంగా అన్నప్రసాదం మరియు తాగునీటి సౌకర్యాలను కల్పిస్తోంది.
Be the first to react