LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు!

NRI TTD Updates: పరదేశాల్లో నివసిస్తూ, ఎప్పుడెప్పుడు స్వదేశానికి వెళ్దామా, ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామిని కళ్లారా చూసుకుందామా అని కోట్లాది మంది ప్రవాస భారతీయులు (NRIs) ఎదురుచూస్తుంటారు. అయితే, ఇండియాకు వచ్చేది తక్కువ రోజులే కావడంతో ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట…

AndhraPravasi News Desk 3 min read
NRI TTD Updates: NRI లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్... ప్రత్యేక దర్శనాల గడువు పెంపు!
  • ఎన్నారైలకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం.. ముందస్తు బుకింగ్ లేకుండానే ప్రత్యేక క్యూ కాంప్లెక్స్ సదుపాయం..
     
  • Devotional: తిరుమల ఎన్నారై దర్శనం: ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు.. కౌంటర్ లోనే రూ. 300 టికెట్!

NRI TTD Updates: పరదేశాల్లో నివసిస్తూ, ఎప్పుడెప్పుడు స్వదేశానికి వెళ్దామా, ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామిని కళ్లారా చూసుకుందామా అని కోట్లాది మంది ప్రవాస భారతీయులు (NRIs) ఎదురుచూస్తుంటారు. అయితే, ఇండియాకు వచ్చేది తక్కువ రోజులే కావడంతో ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం వీరికి పెద్ద టాస్క్‌గా మారుతుంది. అలాంటి ఎన్నారై భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక అద్భుతమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. అదే ‘ఎన్నారై ప్రివిలేజ్డ్ దర్శనం’ (NRI Privileged Darshan). దీని కోసం ఎలాంటి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా తిరుమలకు వెళ్లి ఈ టికెట్ పొందవచ్చు. 

అసలు అర్హత ఏంటి? (Eligibility Criteria)
ఈ ప్రత్యేక కోటా కింద శ్రీవారిని దర్శించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి:
90 రోజుల నిబంధన: ఇప్పటివరకు 30 రోజులు మాత్రమే ఉన్న నిబంధన ఇప్పుడు మీరు విదేశాల నుంచి ఇండియాలో ల్యాండ్ అయిన తేదీ నుంచి 90 రోజుల వరకు పొడిగించారు. అంటే, మీ పాస్‌పోర్ట్‌పై ఉన్న ఇమ్మిగ్రేషన్ స్టాంప్ తేదీ 90 రోజుల కంటే తక్కువగా ఉండాలి. ఒక్కరోజు దాటినా అంటే 91 వ రోజు అయినా అవకాశం ఉండదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్ఆర్ఐ లకు ఇది వర్తిస్తుంది. 
OCI కార్డుదారులు: విదేశీ పాస్‌పోర్ట్ ఉండి ఓసిఐ (OCI - Overseas Citizen of India) కార్డు ఉన్నవారు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎవరికి అనుమతి లేదు?: మీతో పాటు ఇండియాలో ఉండే మీ స్నేహితులు, బంధువులు లేదా తాతమ్మలకు ఈ కోటా కింద అనుమతి లభించదు. కేవలం ఎన్నారై హోదా ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
పిల్లలకు ఉచితం: 12 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ఎలాంటి టికెట్ అవసరం లేదు, వారికి ఎంట్రీ ఫ్రీ.

కావలసిన పత్రాలు (Required Documents)
కౌంటర్ వద్దకు వెళ్లేటప్పుడు కింద పేర్కొన్న పత్రాల ఒరిజినల్స్ మరియు జెరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు:
ఒరిజినల్ పాస్‌పోర్ట్ (Original Passport)
చెల్లుబాటు అయ్యే వీసా / OCI కార్డ్ (Valid Visa / OCI Card)
ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉన్న పాస్‌పోర్ట్ పేజీ జెరాక్స్ కాపీ

తిరుమలలో దర్శన ప్రాసెస్ (Step-by-Step Procedure)
ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి కుదరదు. తిరుమలకు చేరుకున్న తర్వాతే ఈ కింది విధంగా ప్రాసెస్ పూర్తి చేయాలి:
స్టెప్ 1: మొదట ఎన్నారై భక్తులంతా తిరుమలలోని ఏటీసీ సర్కిల్ (ATC Circle) వద్ద ఉన్న ప్రత్యేక దర్శన క్యూ కాంప్లెక్స్ (సుపథం ప్రవేశ ద్వారం) వద్దకు చేరుకోవాలి.
స్టెప్ 2: అక్కడ కౌంటర్ లో ఇచ్చే అప్లికేషన్ ఫామ్‌లో మీ వ్యక్తిగత వివరాలు, వీసా మరియు ఇమ్మిగ్రేషన్ వివరాలను నింపాలి.
స్టెప్ 3: భర్తీ చేసిన ఫామ్‌తో పాటు ఒరిజినల్ పాస్‌పోర్ట్, వీసా జెరాక్స్ కాపీలను అక్కడ ఉండే టీటీడీ అధికారిక సిబ్బందికి అందించాలి.
స్టెప్ 4: వారు మీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి (వెరిఫికేషన్) అంతా కరెక్ట్‌గా ఉంటే అప్రూవల్ ఇస్తారు.
స్టెప్ 5: ఆ తర్వాత మిమ్మల్ని క్యూ కాంప్లెక్స్ లోపలికి పంపుతారు. అక్కడ మీరు వ్యక్తికి రూ. 300 చొప్పున నగదు చెల్లించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కొనుగోలు చేయవచ్చు.

రిపోర్టింగ్ సమయం & స్థలం (Timings & Location)
రిపోర్టింగ్ సమయం: ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు (స్థానిక రద్దీని బట్టి సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు).
రిపోర్టింగ్ స్థలం: స్పెషల్ దర్శన్ క్యూ కాంప్లెక్స్ (సుపథం ఎంట్రీ, ATC సర్కిల్ దగ్గర), తిరుమల.
టికెట్ ధర: రూ. 300 (ఒక్కొక్కరికి).

ఆంధ్రప్రదేశ్ NRI లకు: ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎన్ఆర్ఐ లకు APNRT ద్వారా ప్రత్యేకంగా సోమ, మంగళవారాల్లో 50 VIP దర్శనాలు (500 రూపాయల టికెట్లు) మరియు బుధ,గురు వారాల్లో 30 VIP దర్శనాలు (500 రూపాయల టికెట్లు) అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో సుపథం (Supadam) రూ.300 టికెట్లు కూడా 50 వరకు అందిస్తున్నారు. ఇది మొదటిగా చేసుకున్న 50 టికెట్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. 
కాగా, ప్రస్తుతం ఈ నెల ఆఖరి వరకు రద్దీ రీత్యా అతి తక్కువ టికెట్లు మాత్రమే ఉన్నాయి. జూలై నెల నుండి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి.

స్వామివారిని ప్రశాంతంగా, తక్కువ వేచి ఉండే సమయం (Waiting Time) తో దర్శించుకోవడానికి ఎన్నారైలకు ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి, మీ పత్రాలన్నీ సిద్ధం చేసుకుని, సాంప్రదాయ దుస్తులు (పురుషులకు ధోతీ/కుర్తా, మహిళలకు శారీ/చుడీదార్) ధరించి సుపథం మార్గం ద్వారా వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమల శ్రీవారి కృపకు పాత్రులు కావచ్చు. ఓం నమో వేంకటేశాయ!

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…