LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!

TTD: తిరుమల శ్రీవారి క్షేత్రంలో వీకెండ్ మరియు వేసవి ముగింపు నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 75,691 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం టోకెన్లు లేని సర్వదర్శనానికి 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది.…

AndhraPravasi News Desk 2 min read
TTD: నిన్న ఒక్కరోజే 75 వేల మందికి పైగా దర్శనం... శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!

Devotional- తిరుమల హుండీకి కాసుల వర్షం.. ఒకే రోజులో రూ. 4.14 కోట్ల ఆదాయం!

నిండిపోయిన వైకుంఠం కంపార్ట్‌మెంట్లు.. నారాయణగిరి షెడ్ల వరకు సాగిన క్యూలైన్లు!

వీకెండ్ ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనానికి 12 గంటల వేచింపు.. ప్రసాదాల పంపిణీ ముమ్మరం!

TTD: తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో వీకెండ్ (శనివారం) కావడంతో దేశం నలుమూలల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు కొండకు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే (శుక్రవారం) ఏకంగా 75,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతుండటంతో కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.

కంపార్ట్‌మెంట్లు దాటి క్యూలైన్లు వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్ల వరకు సుదీర్ఘంగా విస్తరించాయి. టోకెన్లు లేని సర్వదర్శనం (ధర్మదర్శనం) కోసం వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి ప్రస్తుతం 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. వేచి ఉన్న సమయమంతా వారికి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను వితరణ చేసేందుకు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే తిరుమల హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి సమయం పడుతుందని, భక్తులు క్యూలైన్లలో సంయమనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే భక్తులు ఈ రద్దీని గమనించి తగిన జాగ్రత్తలతో రావాలని సూచించారు.

ఇక స్వామివారికి భక్తులు సమర్పించే అత్యంత ముఖ్యమైన మొక్కు అయిన తలనీలాల సమర్పణకు కూడా కల్యాణకట్టల వద్ద భక్తులు భారీగా వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద కూడా భక్తుల క్యూలైన్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అదనపు లడ్డూ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచినట్లు, ప్రసాదాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

శని, ఆదివారాల్లో కూడా ఇదే స్థాయి రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విసృతి స్థాయి ఏర్పాట్లతో పాటు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై పరిమితులు విధిస్తూ, సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కేటాయించేలా టీటీడీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తిరుమల కొండకు వచ్చే భక్తులు క్యూలైన్ల తాజా స్థితిని, వేచి ఉండే సమయాలను గమనిస్తూ తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…