Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమనించే ఉంటారు. నగరాల దూరాలు, రోడ్డు భద్రతా నియమాలను తెలిపే ఈ సైన్ బోర్డులు దాదాపుగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి.

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద
highway signboards why are they green in color
  • సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు..

  • దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు..
Highway Signboards: మనం ఎప్పుడైనా కార్లలోనో, బస్సుల్లోనో లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు హైవేలపై పెద్ద పెద్ద బోర్డులను చూస్తూనే ఉంటాం. ఫలానా ఊరు ఇంకాఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఎడమ పక్కకు వెళ్తే ఏ ఊరొస్తుంది? వంటి వివరాలన్నీ ఈ బోర్డులపైనే రాసి ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా... దేశంలో ఎక్కడ చూసినా ఈ హైవే సైన్ బోర్డులు దాదాపుగా ఆకుపచ్చ (గ్రీన్) రంగులోనే ఎందుకు ఉంటాయి?

భారత్లో కొన్ని చోట్ల నీలం రంగు బోర్డులు కూడా కనిపిస్తాయి కానీ, మెజారిటీ రోడ్లపై మాత్రం గ్రీన్ కలర్కే మొగ్గు చూపుతారు. ప్రమాదాలను సూచించడానికి ఎరుపు, పసుపు రంగులు వాడే అధికారులు.. సమాచారాన్ని ఇవ్వడానికి ఈ ఆకుపచ్చ రంగునే ఎందుకు ఎంచుకున్నారో మనం చాలా ఆసక్తికరమైన కారణాలను తెలుసుకుందాం.

డ్రైవర్ల దృష్టి మళ్లకుండా ఉండేందుకే!
రోడ్డుపై వెళ్లేటప్పుడు డ్రైవర్ల శ్రద్ధ ఎప్పుడూ డ్రైవింగ్ మీదే ఉండాలి. సాధారణంగా ఎరుపు (రెడ్) లేదా పసుపు (ఎల్లో) రంగులు చూడగానే కళ్లు వెంటనే అటువైపు ఆకర్షితమవుతాయి. అందుకే 'ఆగండి' (Stop) లేదా 'డేంజర్' అనే హెచ్చరికలకు ఎరుపు రంగును వాడుతుంటారు.

ఒకవేళ హైవే పొడుగునా ఊర్ల పేర్లు, దూరాలు తెలిపే బోర్డులన్నింటికీ ఇలాంటి బ్రైట్ కలర్స్ వాడితే.. డ్రైవర్ల దృష్టి పదే పదే రోడ్డు పక్కకు మళ్లిపోతుంది. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే డ్రైవర్లను అలర్ట్ చేస్తూనే, వారి దృష్టిని పూర్తిగా పక్కదారి పట్టించని రంగు కావాలి కాబట్టే ఆకుపచ్చ రంగును ఎంచుకున్నారు.

కళ్లకు హాయినిచ్చే రంగు..
శాస్త్రీయంగా చూసుకుంటే.. ఆకుపచ్చ రంగు మన కళ్లకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ రంగును ఎంతసేపు చూసినా కళ్లు అలసిపోవు. అమెరికాలోని అరిజోనా రవాణా శాఖ దీనిపై ప్రత్యేకంగా పరిశోధనలు కూడా చేసింది.

హైవేలపై పగటిపూట చుట్టుపక్కల ఉండే చెట్లు, ప్రకృతితో ఈ గ్రీన్ కలర్ బోర్డులు సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల డ్రైవర్ల మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎలాంటి మానసిక ఆందోళన లేదా ఒత్తిడి లేకుండా, రోడ్డుపైనే పూర్తి శ్రద్ధ పెట్టి ప్రయాణించడానికి ఈ రంగు ఎంతగానో సహాయపడుతుంది.

రాత్రి వేళల్లో అద్భుతమైన విజిబిలిటీ!
ఈ ఆకుపచ్చ బోర్డుల వెనుక మరో పెద్ద టెక్నికల్ రీజన్ ఉంది. ఈ బోర్డులపై రాసే అక్షరాలను తెల్లటి రేడియం (Radium) తో రాస్తారు. రాత్రి వేళల్లో వాహనాల హెడ్లైట్ల వెలుతురు ఈ బోర్డులపై పడినప్పుడు.. బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆకుపచ్చ రంగు వల్ల ఆ తెల్లటి అక్షరాలు చాలా స్పష్టంగా, బ్రైట్గా కనిపిస్తాయి.

చీకట్లో కూడా డ్రైవర్లు కళ్లు రిప్సకుండా, చాలా దూరం నుంచే ఆ బోర్డుపై ఏం రాసి ఉందో ఈజీగా చదివేయగలరు. వర్షం పడుతున్నా లేదా పొగమంచు దట్టంగా అలుముకున్నా కూడా ఈ గ్రీన్ బోర్డుల విజిబిలిటీ చాలా బాగుంటుంది.

రోడ్డు పక్కన కనిపించే ఒక చిన్న బోర్డు రంగు వెనుక కూడా ఇంత సైన్స్, డ్రైవర్ల భద్రతకు సంబంధించిన ఆలోచన దాగి ఉందన్నమాట! ఇకపై మీరు హైవేపై వెళ్తున్నప్పుడు ఆ ఆకుపచ్చ బోర్డులను చూస్తే.. అవి కేవలం దారి చూపడానికే కాదు, మీ ప్రయాణం సురక్షితంగా సాగడానికి కూడా డిజైన్ చేయబడ్డాయని కచ్చితంగా గుర్తుకొస్తుంది కదూ..

Tags

Be the first to react

Latest