LIVE
Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Parthiban Trisha Controversy: నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన నటుడు పార్తిబన్.. అసలేం జరిగిందంటే?

Parthiban Trisha Controversy: నటి త్రిషపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ఆర్. పార్తిబన్ క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో విజయ్ అభిమానులే చప్పట్లు కొట్టారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Parthiban Trisha Controversy: నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన నటుడు పార్తిబన్.. అసలేం జరిగిందంటే?

Trisha Instagram Post: నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ ఇటీవల నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో త్రిష వ్యక్తిగత విషయాలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్తిబన్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూనే, ఆ సమయంలో జరిగిన అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఆ కార్యక్రమంలో ఏం జరిగిందనేది వివరిస్తూ.. "అక్కడ వరుసగా 20 ప్రశ్నలు అడిగే రాపిడ్ ఫైర్ రౌండ్ జరుగుతోంది. స్క్రీన్‌పై త్రిష ఫోటో రాగానే, ప్రేక్షకులంతా 'కుందవై.. కుందవై'  అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆ హడావిడిలో సరదాగా ఉంటుందని 'కుందవైని ఇంట్లోనే ఉంచితే మంచిది, అప్పుడు సమస్యలు ఉండవు' అని అన్నాను. అయితే నా మాటల తర్వాత అక్కడ ఉన్న వాళ్లంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టిన వారిలో ఎక్కువ మంది హీరో విజయ్ అభిమానులే ఉన్నారు" అని పార్తిబన్ పేర్కొన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు. మైక్రోఫోన్ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరూ తెలివైన వారు అయిపోరని, అగౌరవంగా మాట్లాడటం ఆ వ్యక్తి యొక్క అజ్ఞానాన్ని, స్వభావాన్ని చూపిస్తుందని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. తన పేరును, ఫోటోను అనుమతి లేకుండా వాడుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. త్రిష చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పార్తిబన్ పై ఒత్తిడి పెరిగింది.

ఈ వివాదం ముదురుతుండటంతో పార్తిబన్ వెనక్కి తగ్గారు. "జరిగిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా నేను అలా మాట్లాడి ఉండకూడదని సూచించారు. వెంటనే నేను నిర్వాహకులను కలిసి ఆ వీడియోను టెలికాస్ట్ చేయవద్దని కోరాను. కానీ ఎవరో మొబైల్ లో తీసిన క్లిప్ బయటకు వచ్చి ఇంత రచ్చ అయింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళల స్వేచ్ఛను గౌరవించే వ్యక్తినని, ఎవరినీ కావాలని నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విజయ్, త్రిషల గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న తరుణంలో పార్తిబన్ చేసిన ఈ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న వేళ, ఆయన ఫ్యాన్స్ పేరును ఈ వివాదంలోకి లాగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పార్తిబన్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదం ఇక్కడితో సర్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…