LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Hansika Motwani Divorce: హన్సిక విడాకుల రచ్చ.. అదంతా ఫేక్ ప్రపంచం అంటూ మాజీ వదిన షాకింగ్ పోస్ట్!

Hansika Motwani Divorce: హీరోయిన్ హన్సిక మోత్వాని సోహైల్ ఖతురియా విడాకుల వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ "అదంతా ఫేక్ ప్రపంచం, కర్మ అంటూ" చేసిన ఇన్‌డైరెక్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

AndhraPravasi News Desk 2 min read
Hansika Motwani Divorce: హన్సిక విడాకుల రచ్చ.. అదంతా ఫేక్ ప్రపంచం అంటూ మాజీ వదిన షాకింగ్ పోస్ట్!

Hansika Motwani Divorce: దేశముదురు సినిమాతో యువత మనసును కొల్లగొట్టిన హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో ఆమె విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడైన కొద్ది గంటల్లోనే, హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన ఇన్‌డైరెక్ట్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ ముస్కాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి.

ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో అత్యంత నకిలీ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ" అంటూ రాసుకొచ్చారు. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

నిజానికి హన్సికకు, ఆమె వదిన ముస్కాన్‌కు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గతంలో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీని ముస్కాన్ వివాహం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో హన్సిక, ఆమె తల్లి జ్యోతి తనను కట్నం కోసం వేధించారని ముస్కాన్ అప్పట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ'  కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసుల గొడవ ఇంకా కోర్టుల్లో నలుగుతూనే ఉంది.

ఇక హన్సిక-సోహైల్ పెళ్లి విషయానికి వస్తే, 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని కోటలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు సోహైల్ ప్రపోజ్ చేసిన విజువల్స్ అప్పట్లో ఒక 'ఫెయిరీ టేల్'లా అనిపించాయి. వీరి పెళ్లిని ఒక రియాలిటీ షోగా కూడా స్ట్రీమింగ్ చేశారు. కానీ, మూడేళ్లు కూడా గడవకముందే మనస్పర్థలు, జీవనశైలిలో తేడాల కారణంగా విడిపోవాలని వీరు నిర్ణయించుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది.

ఈ విడాకుల విషయంలో హన్సిక తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్త నుంచి ఎలాంటి భరణం  గానీ, ఆస్తులు గానీ తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. కేవలం స్వేచ్ఛగా విడిపోవాలని కోరుకున్నట్లు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. ఒకవైపు పెళ్లి బంధం ముగిసిందన్న బాధలో ఉన్న హన్సికకు, తన మాజీ వదిన నుంచి ఇలాంటి 'కర్మ' వంటి వ్యాఖ్యలు ఎదురుకావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…