LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Opinion

Legal News AP: కోర్టు మెట్లెక్కే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం కలగాలి - తిరుపతిలో జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..!

తిరుపతిలో నూతన కోర్టు భవనాల సముదాయానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులు ప్రజలకు న్యాయం అందించే ఆలయాలు కావాలని, న్యాయవాదులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సామాన్యులకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు

AndhraPravasi News Desk 2 min read
Legal News AP: కోర్టు మెట్లెక్కే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం కలగాలి - తిరుపతిలో జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..!

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది. నగరంలో నూతన కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కోర్టు భవనాలకు పునాది రాయి వేయడం చాలా శుభసూచికమని కొనియాడారు. లోకనాయకుడు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు ఎలా వస్తారో, అదే విధంగా ఈ నూతన భవనం కూడా సామాన్య ప్రజలకు న్యాయం అందించే మరో ఆలయంలా మారుతుందని తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ బలోపేతం గురించి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృత్తిలోకి వస్తున్న యువ న్యాయవాదులు చాలా చురుకుగా పనిచేస్తున్నారని, వారి ప్రతిభ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని ప్రశంసించారు. న్యాయవాదులు కేవలం వాదనలు వినిపించడమే కాకుండా, బాధితులకు మేలు జరగాలనే ఉద్దేశంతో సరైన దిశలో ఆలోచించినప్పుడే కక్షిదారులకు నిజమైన న్యాయం అందుతుందని ఆయన సూచించారు. న్యాయవాది చేసే ఆలోచన మీదనే ఒక వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు.

ప్రజల నమ్మకం గురించి సీజేఐ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. మనిషికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, డాక్టర్ దగ్గరకు వెళ్తే కచ్చితంగా నయమవుతుందనే బలమైన నమ్మకంతో ఆసుపత్రికి వెళ్తారని, అక్కడ వైద్యులు ఇచ్చే భరోసానే సగం రోగాన్ని తగ్గిస్తుందని చెప్పారు. సరిగ్గా అదే విధంగా, కోర్టు మెట్లు ఎక్కే సామాన్యుడికి కూడా "న్యాయస్థానానికి వెళ్తున్నాను.. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది" అనే భరోసా కలగాలని ఆకాంక్షించారు. వ్యవస్థపై ప్రజల్లో ఉండే ఆ నమ్మకమే న్యాయవ్యవస్థకు అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తుల మీదనే కాకుండా, ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే న్యాయవాదుల నుంచి ఉన్నత అధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే సామాన్యుడికి న్యాయం చేరువవుతుందని చెప్పారు. ఈ కొత్త భవన సముదాయం అందుబాటులోకి వస్తే న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతిలో కోర్టు భవనాల నిర్మాణం వేగంగా పూర్తి కావాలని, ఇది భవిష్యత్తులో ఎంతోమందికి న్యాయం చేకూర్చే పవిత్ర వేదికగా నిలవాలని జస్టిస్ సూర్యకాంత్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నత న్యాయమూర్తులు, న్యాయవాదులు  జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నూతన భవనం ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్యులకు న్యాయ సేవలను సులభతరం చేయనుంది.

Be the first to react

More Coverage

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న కూతురిపై తల్లిదండ్రులే పైశాచికంగా దాడి చేశారు…