LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Aditya Dhar Net Worth: ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ క్రికెట్ గ్రౌండ్ నుంచి కెమెరా వెనుకకు గల..లగ్జరీ లైఫ్ విశేషాలు..!!

Aditya Dhar Net Worth 2026: దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ నెట్ వర్త్, ఆయన లగ్జరీ కార్లు, ముంబైలోని ఖరీదైన ఇల్లు భార్య యామీ గౌతమ్‌తో కలిసి ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు

AndhraPravasi News Desk 2 min read
Aditya Dhar Net Worth: ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ క్రికెట్ గ్రౌండ్ నుంచి కెమెరా వెనుకకు గల..లగ్జరీ లైఫ్ విశేషాలు..!!

Aditya Dhar Net Worth: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న ఒకే ఒక్క పేరు 'ఆదిత్య ధర్'. కేవలం మూడు గంటల సినిమా చూసేందుకే ఓపిక లేని ఈ రోజుల్లో, ఏకంగా 7 గంటల నిడివి గల ‘ధురంధర్’ చిత్రాన్ని తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా మధ్యలో ఒక్క నిమిషం పక్కకు వెళ్లినా ఎక్కడ సీన్ మిస్ అవుతామో అన్నంత ఉత్కంఠను రేకెత్తించడంలో ఆదిత్య సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో, అసలు ఈ దర్శకుడి నేపథ్యం ఏంటి ఆయన ఆస్తుల విలువ ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆదిత్య ధర్ జీవితం ఒక సినిమా కథ కంటే తక్కువ ఏమీ కాదు. ఢిల్లీకి చెందిన ఆదిత్యకు చిన్నప్పటి నుంచి చదువు కంటే క్రికెట్ అంటేనే అమితమైన ఇష్టం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రాణిస్తూ, టీమ్ ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో ఉండేవారు. అయితే 2002 వరల్డ్ కప్ ఎంపికలో అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై ఆటకు గుడ్ బై చెప్పారు. కానీ అక్కడే ఆయన మరో ప్రయాణం మొదలైంది. కథలు చెప్పడంపై ఆసక్తితో ముంబై చేరుకుని, తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సినిమా మెళకువలను నేర్చుకున్నారు.

ఆదిత్య ధర్ కష్టం వృథా పోలేదు. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆ ఒక్క సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. తాజాగా విడుదలైన 'ధురంధర్ 2' సినిమా కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం 1300 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండో భాగం అంతకు మించి కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఆదిత్య ధర్ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఆయన నెట్ వర్త్ సుమారు 25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆయన భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ ఆస్తి సుమారు 100 కోట్లు. వీరిద్దరి మొత్తం ఆస్తుల విలువ 125 కోట్ల వరకు ఉంటుంది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో వీరికి 20 కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. ఇందులో జిమ్, హోమ్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 

వీటితో పాటు చండీగఢ్‌లో ఒక డ్యూప్లెక్స్ హౌస్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక పురాతన ఇల్లు కూడా ఉన్నాయి.ఇంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఈ జంట చాలా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు. ఆడంబరాలకు దూరంగా, కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరు చేసుకున్న వివాహం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ప్రస్తుతం వీరి దగ్గర బిఎమ్‌డబ్ల్యూ  ఆడి క్యూ7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, తన పనితోనే సమాధానం చెప్పడం ఆదిత్య ధర్ ప్రత్యేకత. ధురంధర్ మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు, మరి ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి..

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…