కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి! కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!

ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు!

2025-12-24 12:55:00
Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.!

అమెరికా కల.. ఎంతో మంది భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితకాల స్వప్నం. అయితే, సరైన వీసా లేకుండా లేదా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన 'అక్రమ వలసదారుల' (Undocumented Immigrants) పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే క్రిస్మస్ మరియు కొత్త ఏడాది సందర్భంగా ఒక అనూహ్యమైన 'హాలిడే ఆఫర్'ను ప్రకటించింది. 

Real Estate Amaravati: అమరావతిలోని ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో KPHB కాలనీ అయ్యే అవకాశం... ఎక్కడో తెలుసా!

దేశం విడిచి వెళ్లమని కేవలం హెచ్చరించడమే కాకుండా, వెళ్లేవారికి భారీ నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లేవారికి 3 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.2.7 లక్షలు అందించనుంది. అంతేకాకుండా అలా వెళ్లిపోయే వారికి అమెరికా ప్రభుత్వమే విమాన టికెట్లకు ఛార్జీలు కూడా భరించనుంది.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లేలా ప్రోత్సహించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సరికొత్త హాలీడే ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లడానికి అంగీకరించే వారికి రూ. 2.7 లక్షల నగదుతో పాటు.. ఫ్రీగా విమాన టికెట్లు అందజేయనుంది. ఈ అవకాశాన్ని వదులుకుంటే వారిని అరెస్ట్ చేసి.. శాశ్వతంగా అమెరికా రాకుండా నిషేధం విధిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. 

Family Survey: ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.. అర్హులు అనర్హుల గుర్తింపు!

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా దేశం నుంచి బహిష్కరించడం కంటే స్వచ్ఛందంగా వారిని వెనక్కి పంపించడమే ఆర్థికంగా లాభమని భావించి ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. గతంలో అమెరికా నుంచి వెళ్లే వలసదారులకు 1000 డాలర్లు అంటే రూ.90 వేలు ఇస్తుండగా., దాన్ని ఇప్పుడు 3 వేల డాలర్లు రూ.2.7 లక్షలకు పెంచింది. 

PAN-Aadhaar: పాన్- ఆధార్ లింక్, డిసెంబర్ 31 వరకే గడువు... లింక్ చేశారో? లేదో... ఇలా చెక్ చేసుకోండి!

స్వదేశానికి వెళ్లేందుకు వన్ వే విమాన టికెట్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉన్నందుకు విధించే సివిల్ జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఇమిగ్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతా డిజిటల్ మయం చేశారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి 'CBP Home' అనే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

Electric Scooter: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంపు!

పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుత నివాస దేశం మరియు ఇతర ప్రాథమిక వివరాలు ఇవ్వాలి. గుర్తింపు కోసం ఒక సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు నేరుగా సంప్రదించి ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు. మీరు మీ స్వదేశానికి చేరుకున్నట్లు యాప్ ద్వారా ధృవీకరించిన తర్వాత మీ ఖాతాకు 3,000 నగదు అందుతుంది. 

Vande Bharath: ఏపీలో రైలు ప్రయాణికులకు తీపికబురు! వందేభారత్ రైలు ఇకపై అక్కడా ఆగుతుంది.. ఫుల్ షెడ్యూల్!

ఈ పథకంపై స్పందించిన హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు అందించే ఉత్తమ క్రిస్మస్ గిఫ్ట్ ఇదేనని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. అలాంటి వారిని తాము వెతికి పట్టుకుని.. అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని.. ఆ తర్వాత వారు జీవితంలో తిరిగి మళ్లీ అమెరికాలో అడుగుపెట్టలేరని హెచ్చరించారు. 

Weight loss pill: ప్రపంచంలోనే తొలి వెయిట్‌లాస్ పిల్.. రోజుకు ఒక్క మాత్ర.. ఊబకాయానికి చెక్ పెట్టే కొత్త ఆయుధం!

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. ఒక్కొక్కరిని బలవంతంగా అరెస్టు చేసి పంపించాలంటే ప్రభుత్వానికి సగటున 17 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.15 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. ఈ స్వచ్ఛంద పథకం ద్వారా ఆ ఖర్చును 70 శాతం వరకు తగ్గించవచ్చని అమెరికా హోం ల్యాండ్ అధికారులు భావిస్తున్నారు. 

Russia Ukraine War: అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా! కారణం అదేనట!

ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి అమెరికాలో ఉండి, అక్కడ ఇళ్లు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇది ఒక సంకట స్థితి. అయితే, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న మాస్ డిపోర్టేషన్ (Mass Deportation) చర్యలను చూస్తుంటే, అరెస్ట్ అయ్యి అవమానకరంగా వెళ్ళడం కంటే, ఈ నగదు ప్రోత్సాహకంతో వెళ్ళడమే మేలని చాలా మంది భావిస్తున్నారు.

TTD Updates: వృద్ధులకు ఉచిత బాలాజీ దర్శన పథకం ప్రారంభం.. కానీ అవి తప్పనిసరి!!
H1b Visa Update2026: హెచ్-1బీ వీసా లాటరీ రద్దు.. 2026 నుంచే కొత్త ఎంపిక విధానం.!!
CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఆ జిల్లాల్లో..
Risk of cancer: ఈ అలవాట్లు క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయా.. నిపుణుల హెచ్చరిక!
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు... ఇచ్చేది అప్పుడే! పత్రాలు రెడీ చేసుకోండి!
Praja Vedika: నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →