USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా అడుగులు.. పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్? Ceasefire: లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ... వాషింగ్టన్‌లో కీలక ఒప్పందం! Middle East War: పాకిస్తాన్ అంతం దగ్గర పడింది... బలోచిస్తాన్ పోరాటంతో దాయాది దేశం కకావికలం! USA: అభివృద్ధిలో వలసదారుల పాత్ర కీలకం.. భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా అడుగులు.. పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్? Ceasefire: లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ... వాషింగ్టన్‌లో కీలక ఒప్పందం! Middle East War: పాకిస్తాన్ అంతం దగ్గర పడింది... బలోచిస్తాన్ పోరాటంతో దాయాది దేశం కకావికలం! USA: అభివృద్ధిలో వలసదారుల పాత్ర కీలకం.. భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు!

Australia: ఆస్ట్రేలియాలో సీబీఎన్ పుట్టినరోజు వేడుకలు.. సీఎం చంద్రబాబు పై అభిమానాన్ని చాటుకున్న బ్రిస్బేన్ తెలుగుతమ్ముళ్ళు!

టీడీపీ కార్యకర్తలతో పసుపుమయమైన బ్రిస్బేన్ నగరం..ఆత్మీయ కలయిక.. ఉత్సాహభరిత వేడుక.. నాయకుడి విజన్ పై ప్రశంసలు..బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రం

Published : 2026-04-20 21:27:00

టీడీపీ కార్యకర్తలతో పసుపుమయమైన బ్రిస్బేన్ నగరం..

ఆత్మీయ కలయిక.. ఉత్సాహభరిత వేడుక.. నాయకుడి విజన్ పై ప్రశంసలు..

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రం, బ్రిస్బేన్ నగరం పసుపుమయమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CBN) గారి పుట్టినరోజును పురస్కరించుకుని, అక్కడి టీడీపీ అభిమానులు అత్యంత ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. మాతృభూమికి దూరంగా ఉన్నా, తమ ప్రియతమ నాయకుడిపై ఉన్న గౌరవాన్ని, ప్రేమని ఈ వేడుకల ద్వారా చాటుకున్నారు.

బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగువారందరూ ఒకచోట చేరి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే చంద్రన్న" అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ పండుగలా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో పలువురు ప్రవాసాంధ్రులు మరియు టీడీపీ మద్దతుదారులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో గుడురు రామకృష్ణ, చలసాని రవి, నాగేష్ బోడపాటి, గౌతమ్ మంచికలపూడి, మణి మెద్దల, తరుణ్ వరాహ, రవి గద్దిపాటి, రాజేష్ కనికాటి, ఉమాదేవి గుడురు, హారిక కోనేరు, మనోజ్ వేముల, విద్యాధర్ రెడ్డి పొత్తా, గురురాజ్ అనేగొంది తదితరులు పాల్గొన్నారు, వీరితో పాటు పెద్ద సంఖ్యలో ఇతర టీడీపీ మద్దతుదారులు, ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్ మరియు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పథంలో పడాలంటే ఆయన నాయకత్వం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. పరాయి దేశంలో ఉన్నా మన సంస్కృతిని, మన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని ఇలా పంచుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.

Spotlight

Read More →