AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు!

AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా..

AP New Company: ఏపీలోని రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా పరుగులు పెట్టనుంది. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఏకంగా రెండు భారీ పరిశ్రమలు కొలువుదీరబోతున్నాయి. అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌తో పాటు ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Published : 2026-05-01 11:47:00
  • ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి..
     
  • Politics: పుట్టపర్తి సమీపంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా సన్నాహాలు..

AP New Company: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం త్వరలోనే పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కబోతోంది. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌తో పాటు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనుండటంతో ఈ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ముందుకు వస్తున్న ఈ ప్రాజెక్టులు స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త జవజీవాలు పోయనున్నాయి.

ఈ భారీ ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే, ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ శ్రీసత్యసాయి జిల్లాలో రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారీ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రూ. 3,267.69 కోట్లు, రెండో దశలో రూ. 6,972.09 కోట్లు వెచ్చించనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,017 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికోసం చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 30 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ కింద అవసరమైన అనుమతులు పొందేందుకు సదరు సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది.

సెమీకండక్టర్ యూనిట్‌తో పాటు పుట్టపర్తి సమీపంలో ఏరోస్పేస్‌, డ్రోన్ మరియు డిఫెన్స్‌ క్లస్టర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ రంగంలో భవిష్యత్తులో ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అత్యంత ఆశాభావంతో ఉంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిశ్రమల శాఖ అధికారులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

Spotlight

Read More →