ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ నిర్వహించనున్న “మినీ మహానాడు" కు ఆహ్వానం..
టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా..
తిరుపతి: ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ) కువైట్ అధ్యక్షుడు ములకల సుబ్బరాయుడు నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పిడికిటి శ్రీనివాస్ చౌదరి ఈ రోజు ఉదయం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కువైట్‌లో మే 22న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ–కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “మినీ మహానాడు” కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయన సహకారం కోరారు. అలాగే కువైట్‌లో ఉన్న ఎన్ఆర్ఐల తరఫున ఎదురవుతున్న కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితులు, అవసరమైన సదుపాయాలు, తీసుకోవాల్సిన చర్యలపై నేతలు వివరంగా చర్చించారు.
వారి మాటలను శ్రద్ధగా విన్న డాలర్ దివాకర్ రెడ్డి గారు, ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి, ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ఒక మంచి దిశగా మారుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.