తేదీ 24-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 24 డిసెంబర్ 2025 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ నూకసాని బాలాజీ గారు (ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
తేదీ 23 డిసెంబర్ 2025, మంగళవారం న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య నాయకులు హాజరై ప్రత్యక్షంగా వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీమతి గుమ్మడి సంద్యారాణి గారు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొరగం శ్రీనివాసులు గారు కూడా హాజరై ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. ప్రజా వేదిక ద్వారా సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నేతలు తెలిపారు.