Germany: జర్మనీలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు..

Germany: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన ఖాతాదారులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

greetings people occasion of the end anarchy ap two years since beginning good governance
greetings people occasion of the end anarchy ap two years since beginning good governance
  • చంద్రబాబు నాయకత్వం, లోకేష్ చొరవతో రాష్ట్రం 20 ఏళ్లు ముందుకెళ్లిందన్న నేతలు..

  • ముఖ్య అతిథులుగా  నందమూరి రామకృష్ణ, గళ్లా మాధవి, మన్నవ సుబ్బారావు హాజరు..
Germany: జర్మనీలో  మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.  జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.  జై తెదేపా.. ఎన్టీఆర్ అమర్ రహే...జై చంద్రబాబు... జై లోకేష్.. నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.  greetings people occasion of the end anarchy ap two years since beginning good governance   •  కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత  ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించటం తన అదృష్టమని తెలిపారు.  కుటుంబం కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని పేర్కొన్నారు. "తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్.  సినిమాల్లో నటించినా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినా  ఏది చేసినా  ప్రజా హితం... సంచలనమే. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధి తో అమలుచేసిన ఘనత  మా నాన్నగారు, తెలుగువారి అన్నగారు ఎన్టీఆర్ కే దక్కుతుంది" అని రామకృష్ణ తెలిపారు.    *  ఆస్తిలో హక్కునేకాదు... రాజ్యాధికారాన్నీ కట్టబెట్టారు  మహిళలకు ఆస్తిలో హక్కునేకాదు... రాజ్యాధికారాన్నీ కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్,  చంద్రబాబులకు దక్కుతుందని గళ్లా మాధవి అన్నారు.  దానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. "బీసీలకు అసలైన స్వాతంత్ర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది.  బ్యాక్ వార్డ్ క్లాసెస్గా పిలుస్తూ అణచివేతకు గురవుతున్న బీసీలను సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని గుర్తించి, వెన్నుతట్టి ప్రోత్సహించింది తెదేపానే.    •  తెలుగుదేశం పాలన ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొనివచ్చింది.  కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్  అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. అవినీతి, అరాచకం విధ్వంసంతో సాగిన జగన్ పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో పోటుపొడిచారని... చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని స్పష్టం చేశారు. మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రమే కాదు ప్రజాస్వామ్యనికి కొత్త అర్ధం చెప్పిన రోజు. లక్షలాది మంది కార్యకర్తల ఆత్మీయ కలయిక. తెలుగుదేశం మూడు తరాల ప్రస్థానం, స్థాపన, స్థిరీకరణ, సరికొత్త దిశగా మార్పు చెందింది. " అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలతో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.   గల్లా రామచంద్ర రావు గారు మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఆంధ్రాలో పెడ్తుబడులు పెట్టాలి, అమరావతి అభివృద్ధిలో  పాలు పంచుకోవాలి అని పిలుపినించారు     అలాగే ఈ కార్యక్రమంలో జర్మనీ నుంచే గాక ఐర్లాండ్ నుంచి కిషోర్ చలసాని, నెదర్లాండ్స్ నుంచి రావి అమర్చంద్, ఇంకా ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి కూడా పాల్గొన్నారు  అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.   మహానాడు మహా విందు 46 వంటకాలతో అతిధులకు ఆంధ్ర రుచిలతో  విందు ఏర్పాటు చేశారు మహానాడు లో ఆంధ్ర పద్ధతిలో బంతి భోజనం పెట్టి అందర్నీ అబ్బురపరిచారు    ఈ కార్యక్రమాన్ని వెనుక ఉండి TDP జర్మనీ ఎగ్జిక్యూటివ్ మరియు కోర్ టీం విజయం చేసారు. అలాగే ఈ కార్యక్రమానికి రామ్ బోళ్ల మరియు మునిచ్ టీడీపీ జర్మనీ టీం శివ నక్కలా, దరహాస, లీల, ప్రేమ్ నాదెళ్ల, దినేష్ కోవి, వంశి ఉండవల్లి, అరవింద్ చౌదరి, కిరణ్ పొట్లూరి, వరుణ్ తదితరులు వెనుక ఉండి విజయం చేయటంలో కీలక పాత్రా పోషించారు.

Tags

Be the first to react

Latest