LIVE
Fuel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలోనే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!  •  Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్‌లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్‌ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!  •  APNRT: ప్రవాసాంధ్రులకు సువర్ణావకాశం... విదేశాల్లో కనకదుర్గమ్మ ప్రత్యేక గృహ పూజల సదుపాయం!  •  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం! పూర్తి వివరాలు...  •  AP Students: విద్యార్థులకు అలర్ట్... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన!  •  Chandrababu: జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస.. 11వ తేదీ రాత్రికి..  •  తెరపైకి కొత్త డిమాండ్... మాకు ఎస్సీ హోదా కల్పించండి!!  •  AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...  •  New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!  •  Gas Price Hike India: బిగ్ షాక్.. గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించిన కేంద్రం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TCA: టీసీఏ ‘హ్యూస్టన్ ఐడల్’కు రంగం సిద్ధం.. ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదిక!

TCA: అమెరికాలోని తెలుగు సమాజంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

AndhraPravasi News Desk 2 min read
TCA
TCA

ప్రవాస తెలుగు ప్రతిభకు భారీ వేదికగా ‘హ్యూస్టన్ ఐడల్’..

సింగ్.. డాన్స్.. షైన్.. టీసీఏ నుంచి యువతకు సువర్ణావకాశం..

హ్యూస్టన్: అమెరికాలోని తెలుగు సమాజంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థ 50వ వార్షికోత్సవ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ‘హ్యూస్టన్ ఐడల్’ పేరుతో భారీ టాలెంట్ పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

“సింగ్.. డాన్స్.. షైన్” అనే ఆకర్షణీయమైన నినాదంతో నిర్వహిస్తున్న ఈ పోటీలు సంగీతం, నృత్య రంగాల్లో ప్రతిభ కలిగిన ప్రవాస తెలుగు వారికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అరుదైన అవకాశాన్ని అందించనున్నాయి.

జూన్ 27, 2026 శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టెక్సాస్ రాష్ట్రంలోని ఫుల్షీర్ నగరంలో ఉన్న ఐరిన్ స్టెర్న్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.

పోటీల్లో భాగంగా సోలో సింగింగ్, సోలో డాన్స్, గ్రూప్ డాన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. గ్రూప్ డాన్స్ విభాగంలో కనీసం ఇద్దరు, గరిష్టంగా పది మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంటుంది.

వయస్సు ఆధారంగా పోటీలను మూడు విభాగాలుగా విభజించారు. 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు సబ్ జూనియర్, 14 నుంచి 19 సంవత్సరాల వారు జూనియర్, 20 సంవత్సరాలు పైబడిన వారు సీనియర్ విభాగంలో పోటీపడవచ్చు.

పోటీల్లో పాల్గొనదలచిన ప్రతి ఒక్కరికీ 30 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించారు. నమోదు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 15, 2026గా ప్రకటించారు. ఆసక్తి గలవారు సంస్థ వెబ్‌సైట్ లేదా ఫ్లయ్యర్‌లో ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రత్యేక అవకాశం కూడా లభించనుంది. ఆగస్టు 8, 2026న ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్‌లో జరిగే టీసీఏ 50వ స్వర్ణోత్సవ ప్రధాన వేడుకల్లో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పించనున్నారు.

ప్రవాస తెలుగు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి పెద్ద వేదికను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీసీఏ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి, సాంస్కృతిక కమిటీ చైర్‌పర్సన్లు స్నేహలత చిర్ర, శాంత సురేష్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాల కోసం స్నేహ, ఆశ జ్యోతి తదితర నిర్వాహకులను సంప్రదించవచ్చని టీసీఏ ప్రతినిధులు తెలిపారు. ప్రవాస తెలుగు కళాకారులకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని వారు పేర్కొన్నారు.

Tags

Be the first to react

More Coverage

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెన్స్ డబు…

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన ఓ మహిళ, తాను నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌ల…