అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదురయ్యాయి. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో సన్‌బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్‌తో దాడి చేసి లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!


ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ట్రంప్‌నకు ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ కూడా ఇక ఏమాత్రం సురక్షితం కాదు. ఆయన సన్‌బాత్ చేస్తుండగా డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా సులభమైన పని" అని ఆయన హెచ్చరించారు. 2020లో ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్య వెనుక ట్రంప్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ‘బ్లడ్ పాక్ట్’ అనే ఓ ప్లాట్‌ఫామ్ ట్రంప్‌పై బౌంటీ ప్రకటించి నిధులు సేకరించడం గమనార్హం. ఈ నెల 8 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 27 మిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇరాన్ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Ration Rice Scam:: రేషన్ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం! మంత్రి మనోహర్ కీలక ఆదేశాలు!

ఈ హత్యాయత్నం బెదిరింపులపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ అధికారి వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా "అవును, నేను ఈ వ్యాఖ్యలను ముప్పుగానే భావిస్తున్నా. అది నిజమో కాదో తెలియదు, కానీ కావచ్చు" అని బదులిచ్చారు. చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారని అడగ్గా, నవ్వుతూ తన ఏడేళ్ల వయసులో అని, ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం ఉండదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం టెహ్రాన్‌తో చర్చలకు రావాలని అమెరికా పిలుపునిస్తుండగా, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

Bank strike: అలర్ట్‌.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!

Chandrababu Comments: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం! వారి నీచ సంస్కృతిని..

 Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!

Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!

Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!

Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!

Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!

Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!

Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!

Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..

Mobile Bills: మొబైల్‌ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

 Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!

 Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

 Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందాఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group