Header Banner

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!

  Sat May 17, 2025 08:32        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పేదల కోసం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తోంది. గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు స్థలం ఇస్తారు. అర్హులైన లబ్ధిదారులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం కూడా అందుతుంది. సొంత ఇల్లు లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు స్థలం ఇస్తారు. గతంలోనే పేదల ఇళ్లకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముందుగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని.. సిబ్బంది వాటిని పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ ద్వారా సహాయం అందుతుంది. ప్రస్తుతం అందరికీ ఇళ్లు పథకం అమలు చేస్తున్నా.. ఇప్పటికీ చాలామందికి దీని గురించి అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదు.. దీంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పేదలకు ఇళ్ల పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

ఏపీ ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత ఉన్నవారు అక్కడికి వెళ్లి వివరాలు ఇస్తే.. వాటిని వీఆర్వో లాగిన్‌కు పంపుతారు. అనంతరం రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి, స్థలం మంజూరు చేయడానికి సిఫార్సు చేస్తారు.. అంతేకాదు వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు. పట్టణాల్లో రూ.2.50 లక్షలు ఇస్తారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టలేదు.. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కేటగిరీలుగా విభజించి, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనంగా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అర్హత ఉండి సొంత ఇల్లు లేని పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు ఆదేశించారు.

 

ఈ పథకానికి సంబంధించి నిబంధనలు ఇలా ఉన్నాయి.. బీపీఎల్‌ కేటగిరీ (పేదలు) వారు ఈ పథకానికి అర్హులు. తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి.. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం ఉండకూడదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సొంత స్థలం కూడా ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ పథకాల్లో లబ్ధి పొందకూడదు.. ఐదెకరాల మెట్టు లేదా 2.50 ఎకరాల మాగాణి మించకూడదు అనే రూల్స్ ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి సిఫార్సులు అవసరం లేదని.. నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి సరైన పత్రాలు అందజేస్తే ఆరు దశల పరిశీలన ఉంటుందంటున్నారు అధికారులు. అధికారులు ఆదాయ వివరాలు, భూములు, సొంత ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డు వంటి నిబంధనల్ని పరిశీలిస్తారు. ఆరు దశల పరిశీలన తర్వాత అర్హులైతే ఇల్లు మంజూరవుతుంది. ఈ మేరకు పేదల ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే పనిలో ఉన్నారు అధికారులు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #WelfareScheme #FinancialAid #SupportForPoor #APGovernment #TDP #PublicWelfare