Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

  Wed May 14, 2025 11:38        Business

ఏపీ ఫైబర్నెట్ను పూర్తి స్థాయిలో సంస్కరించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రానున్న నాలుగేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 50 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించింది. నెట్వర్క్ లైన్ల నిర్వహణను ఈపీసీ విధానంలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సుమారు రూ.1,900 కోట్లతో ప్రతిపాదన రూపొందించి, ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి సమకూర్చుకోనుంది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. త్వరలోనే లైన్ల నిర్వహణ పనులకు టెండర్లు పిలుస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. గత ప్రభుత్వం సంస్థను అన్ని విధాలా నిర్వీర్యం చేయడంతో కనెక్షన్ల సంఖ్య 9 నుంచి 4.5 లక్షలకు తగ్గింది. ఈ పరిస్థితుల నుంచి సంస్థను గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వినియోగదారులకు చౌక ధరకు కేబుల్, నెట్, ల్యాండ్ ఫోన్ సేవలు అందించే లక్ష్యంతో 2016లో ఫైబర్నెట్ను అప్పటి తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

ఇది కూడా చదవండి: ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

బేసిక్ ప్లాన్ కింద రూ.149కి సేవలు అందించింది. ప్రస్తుతం సంస్థలో 300 మంది సిబ్బందే ఉన్నారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా ప్రసారాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే సరిచేయడం సాధ్యం కావడం లేదు. చాలా చోట్ల ప్రసారాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రెండు వారాల్లో 25 వేల మంది వినియోగదారులకు సంస్థకు దూరమయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థపై ఆధారపడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,500 మంది ఆపరేటర్ల పరిస్థితి దయనీయంగా మారుతుందని కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'విశాఖలోని ఎన్వోసీ సెంటర్ నుంచి సుమారు రెండు గంటలు సిగ్నల్ నిలిచింది. రాష్ట్రం అంతటా ప్రసారాలకు ఇబ్బంది ఏర్పడింది. అధికారుల దృష్టికి సమస్య తీసుకెళదామంటే ఎవరి నుంచీ స్పందన రావడం లేదు' అని జేఏసీ చైర్మన్ సీతారామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations