అమెరికాలో నివసిస్తూ భారతదేశంలోని తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) ఇది కొంత ఆందోళన కలిగించే వార్త. అమెరికాలో పౌరసత్వం లేని వ్యక్తులు విదేశాలకు పంపే డబ్బుపై 5 శాతం పన్ను విధించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఒక కొత్త ముసాయిదా చట్టాన్ని ప్రతిపాదించారు. 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'గా పిలుస్తున్న ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే, ఈ ఏడాది జూలై 4 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే, కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం లేదా పెట్టుబడుల కోసం భారత్‌కు డబ్బు పంపే ప్రతిసారీ అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుంది.
ఈ కొత్త పన్ను ప్రతిపాదన అమెరికాలో హెచ్-1బీ, ఎఫ్-1, జె-1 వంటి వీసాలపై ఉన్నవారు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, సరైన పత్రాలు లేని వలసదారులను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు భారతదేశం లో ఉన్న మీ తల్లిదండ్రులకు ఒక లక్ష రూపాయలు పంపితే, అదనంగా ఐదు వేల రూపాయలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును రెమిటెన్స్ ప్రొవైడర్లు వసూలు చేసి, ప్రతీ త్రైమాసికంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తారు. అమెరికా పౌరులు లేదా జాతీయులకు మాత్రం, వారు ప్రభుత్వం ఆమోదించిన 'క్వాలిఫైడ్' ప్రొవైడర్ ద్వారా డబ్బు పంపితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ మారకద్రవ్యాన్ని పొందుతున్న దేశం భారతదేశం. ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే, భారత్‌కు వచ్చే నిధులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపడమే కాకుండా, రూపాయి విలువ మరింత క్షీణించడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో సుమారు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, వీరిలో చాలా మంది తమ కుటుంబ ఖర్చులు, విద్య, వైద్యం, ఆస్తుల కొనుగోలు కోసం క్రమం తప్పకుండా డబ్బు పంపుతుంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ బిల్లు ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. చట్టంగా మారాలంటే అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్‌కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!
ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!
తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!
వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!
సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: