భారత పాస్‌పోర్ట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైన పీఎస్పీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది.
భారత పాస్‌పోర్ట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైన పీఎస్పీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డాటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం
ఇది సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్ కవర్‌లో చిప్, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అథెంటికేషన్ సులభతరం అవుతుంది.
ఇది కూడా చదవండి: సీసీటీఎన్‌ఎస్ పునరుద్ధరణకు ప్రభుత్వం జీవో! ₹12 కోట్లు మంజూరు !
ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్ సేవలు హైదరాబాద్ సహా 13 నగరాల్లో మాత్రమే అందుతున్నాయి. అయితే, ఈ ఏడాది ప్రథమార్థం ముగిసే నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో ఈ సేవ లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
నగరాలు: హైదరాబాద్, నాగ్‌పూర్, భువనేశ్వర్, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్, అమృత్‌సర్, జైపూర్, చెన్నై, సూరత్, రాంచీ, ఢిల్లీ.
ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉన్నవారు కచ్చితంగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు వాటి ఎక్స్‌పైరీ డేట్ వరకు సేవలందిస్తాయి. ఈ-పాస్‌పోర్ట్ అప్‌గ్రేడ్ అనేది ఆప్షనల్ మాత్రమే.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!
తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!
వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!
సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: