Malaysia Tour: అమరావతి కోసం సరికొత్త ఆలోచనలు.. ప్రవాసాంధ్రులకు మంత్రి నారాయణ పిలుపు!

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇద్దరుగా వందల మంది హత్యచేసి పూడ్చిపెట్టారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్కడ చేపట్టిన తవ్వకాల్లో మానవ పుర్రెలు, ఎముకలు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. పవిత్ర ఆలయ ప్రాంతం చుట్టూ అదృశ్యాల మిస్టరీ మరింత ముదురుతోంది.

ఫ్రెండ్‌షిప్ డే! స్నేహానికి అంకితమైన ఒక ప్రత్యేక దినోత్సవం..

ఇది ఇలా ఉంటే, 1995 నుంచి 2014 మధ్యకాలంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి జూలై 3న పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తాను లైంగికదాడులకు గురైన మహిళలు, మైనర్ల మృతదేహాలను సహా వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని, తన ప్రాణాలకు భయం ఉందని చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది.

Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!

కార్మికుడు చూపిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించిన సిట్ బృందం, ఇప్పటివరకు గుర్తించిన 13 ప్రాంతాల్లో ఆరింటిలో తవ్వకాలు చేపట్టింది. వాటిలో ఎరుపు రంగు జాకెట్, పాన్ కార్డు (లక్ష్మి అనే మహిళ పేరిట) లభించాయి. ఇవి కీలక ఆధారాలుగా మారాయి.
ఈ దర్యాప్తులో తాజాగా జయన్ టి. అనే వ్యక్తి ముందుకు వచ్చి, 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని పూడ్చిన ఘటనను తానే చూశానని వెల్లడించాడు. దాంతో సిట్ దృష్టిని మరో కోణంలోకి మళ్లించి విచారణ చేపట్టింది.

Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!

అంతేకాదు, 1995-2014 మధ్యకాలంలో ధర్మస్థల పరిసరాల్లో దాదాపు 250 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 2013లో జరిగిన సౌజన్య హత్యకేసు అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తాజా ఘటనల నేపథ్యంలో పాత కేసుల ఫైళ్లన్నీ మళ్లీ తెరుచుకుంటున్నాయి.
ఈ కేసులో మీడియా కవరేజీపై పూర్వంలో విధించిన గ్యాగ్ ఆర్డర్‌ను ఇటీవల కర్ణాటక హైకోర్టు రద్దు చేయడం కీలక మలుపు.

Luxury Boat Tour: గోదావరి తరహాలో లగ్జరీ బోట్ టూర్! రూట్ ఇదే.. పూర్తి వివరాలు!

సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ, "ధర్మస్థల దేవాలయం శ్మశానంగా మారింది. ఆలయ ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలి" అంటూ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుండగా, ఈ ఘోరమైన హత్యల వెనుక అసలైన సూత్రధారులు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో రానుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!