భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్ రష్యాతో (Russia) ఏం చేస్తోందో తనకు తెలుసుకోవాలనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తమకు సంబంధం లేకుండా భారత్ తాను అనుకున్న విధంగా వ్యవహరిస్తోందని సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉందని, అది ఇంకా పడిపోయినా తమకు పెద్దగా నష్టం లేదని వ్యాఖ్యానించారు.
అమెరికా (America) భారత్‌తో పెద్దగా వ్యాపారం జరుపడంలేదని ట్రంప్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధించే దేశాలలో ఒకటిగా పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలపై గతంలోనూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రస్తుతం రష్యా మరియు అమెరికా మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు లేకపోవడం సంతోషకరమని, ఇది అలాగే కొనసాగాలని ట్రంప్ తన ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ట్రంప్ భారత్ పై చూపిస్తున్న వ్యాపార, భౌగోళిక రాజకీయ వ్యూహాలపట్ల ఉన్న విమర్శాత్మక దృక్పథాన్ని సూచిస్తున్నాయి. ఆయన గతంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.