New Railway Line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,853 కోట్లతో.. ఇక 3 గంటల్లో సికింద్రాబాద్!

హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణికులు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ప్రయాణికులు తగ్గిపోయారని పదేపదే వాపోయే ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ, ఇప్పుడు ప్రయాణికులు ఎక్కువగా వస్తే కూడా వారిని లోపలికి అనుమతించని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రాయదుర్గం టర్మినల్ స్టేషన్ వద్ద వర్షం పడుతున్నా కూడా ప్రయాణికులను స్టేషన్ వెలుపలే నిలిపేయడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!

రాయదుర్గం స్టేషన్‌ రోజూ వేలాది మంది ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రాకపోకలకు కీలక కేంద్రంగా ఉంది. అయితే గత నెల 26న భారీ వర్షం కురుస్తున్న సమయంలో స్టేషన్ లోపల రద్దీ ఎక్కువ కావడంతో కొత్తగా వచ్చిన ప్రయాణికులను లోపలికి అనుమతించలేదు. ‘మెట్లమీదైనా నిలబడతాం’ అని అభ్యర్థించినా, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన స్టేషన్‌లో తగిన స్థలమూ, సౌకర్యాలూ లేవనే విమర్శలకు కారణమైంది.

School Holidays: విద్యార్థులకు శుభవార్త! సెప్టెంబర్‌లో వరుస సెలవుల జాతర!

రాయదుర్గం టర్మినల్ స్టేషన్ కోసం ప్రభుత్వం గతంలోనే 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమిలో ప్రయాణికులకు పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాల్సింది. కానీ ఎల్ అండ్ టీ ఆ స్థలాన్ని మూడో పార్టీకి దీర్ఘకాల లీజుకు ఇచ్చేసి దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సంపాదించింది. అయితే ప్రయాణికుల పార్కింగ్ విషయాన్ని పూర్తిగా విస్మరించడంతో వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి నెలకొంది.

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సెన్సేషనల్ ఆఫర్‌..! కేవలం రూ.1కే అపరిమిత కాల్స్, డేటా, SMS!

ఇంకా వర్షాకాలంలో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. గాలి, వెలుతురు బాగా వచ్చేలా మెట్రో స్టేషన్లను ఆధునిక టెక్నాలజీతో నిర్మించినా, వర్షం పడితే ప్లాట్‌ఫాంలపైకి నీరు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిలిచిపోతుంది. ఫలితంగా ప్రయాణికులు జారి పడిపోయిన సంఘటనలు కూడా నమోదవుతున్నాయి.

People Request: మా ఊర్ల పేర్లు మార్చండి! అవమానాలు భరించలేకపోతున్నాం!

కాన్‌కోర్స్ స్థాయిలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్మాణం జరిగి దాదాపు పదేళ్లు కావడంతో కొన్ని స్టేషన్లలో పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. అమీర్‌పేట, ఎల్బీనగర్, తార్నాక, రాయదుర్గం వంటి స్టేషన్లలో వర్షం పడితే ప్రయాణికులు తడవాల్సిందే. పైగా ప్లాట్‌ఫాంలలో నీరు చేరి నిలబడటానికి కూడా స్థలం దొరకకపోవడం ప్రయాణికుల అసహనానికి దారితీస్తోంది.

Europe Trip: యూరప్‌ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? అయితే జాగ్రత్త! అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం!

ఇప్పటికే ఛార్జీలు పెంచుతూ ప్రయాణికులపై భారం మోపుతున్న మెట్రో సంస్థ, కనీస వసతులు కూడా కల్పించకపోవడం పెద్ద ప్రశ్నగా మారింది. వర్షం వస్తే రద్దీ, పార్కింగ్ సమస్యలు, నీటి లీకేజీలు – ఇవన్నీ కలిసి ప్రయాణికుల ఇబ్బందులను రెట్టింపు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ప్రయాణికుల నమ్మకం కోల్పోవడం ఖాయమని ప్రజలు అంటున్నారు.

Oman Government: ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం! సెప్టెంబర్ 7న పబ్లిక్ హాలిడే! ఎందుకో తెలుసా!
Teachers: ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్‌..! అది తప్పనిసరి అని క్లారిటీ!
BRS Telangana: కుటుంబ రాజకీయాల్లో ఊహించని మలుపు! ఆమెపై బీఆర్ఎస్ కఠిన నిర్ణయం! పార్టీ నుండి సస్పెన్షన్!
Kanchana4 Update: రష్మిక కెరీర్‌లో బిగ్ ఛాలెంజ.. కాంచన 4లో దడ పుట్టించే పాత్ర!